Sophia Leone Death : విషాదం.. 26 ఏళ్లకే ప్రముఖ పోర్న్ స్టార్ మృతి.. అడల్ట్ ఇండస్ట్రీని వణికిస్తున్న వరుస మరణాలు
పోర్న్ ఇండస్ట్రీలో అనుమానాస్పదంగా ఏదో జరుగుతున్న సంకేతాలు అందుతున్నాయి. తాజాగా తీవ్ర విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ప్రముఖ పోర్న్ స్టార్ సోఫియా లియోన్ 26 ఏళ్ళ అత్యంత పిన్న వయసులో మరణించింది. వారం వారం క్రితమే ఆమె మరణించినట్లు తెలుస్తోంది.
అయితే ఆమె కుటుంబ సభ్యులు ఆలస్యంగా మీడియాకి తెలిపారు. సోఫియా మృతి కూడా అనుమానాస్పదంగానే ఉంది. ఆమె తన అపార్ట్మెంట్ లో మరణించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సోఫియా సవతి తండ్రి మీడియాకి తెలిపారు. తన అపార్ట్మెంట్ లో సోఫియా చాలా సమయం ఉండిపోయింది. ఆమె నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. వెళ్లి చూస్తే ఆమె విగతజీవిగా అపార్ట్మెంట్ లో ఉంది.
అసలు సోఫియా మరణానికి కారణాలు ఏంటి అనేది ఇంతవరకు కుటుంబ సభ్యులు రివీల్ చేయలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. సోఫియా ఆత్మహత్య చేసుకుందా లేక ఆమె మరణానికి ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.

సోఫియా ఎప్పుడూ ఎవరినీ ఇబ్బంది పెట్టిన అమ్మాయి కాదని.. తన చుట్టూ ఉన్న వారిని సంతోషంగా ఉంచే స్వభావం అని ఆమె సవతి తండ్రి మీడియాకి తెలిపారు. ఆమెకి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం అని తెలిపారు. పోర్న్ ఇండస్ట్రీలో రాణిస్తున్న ఆమె ఇలా ఆకస్మికంగా మరణించడం వెనుక కారణాలు అంతుచిక్కడం లేదు.
సోఫియా మృతితో పోర్న్ ఇండస్ట్రీలో వణుకు మొదలయింది. ఎందుకంటే గత రెండు నెలల్లో సోఫియా మృతి నాల్గవది. జనవరి 6న తైనా ఫీల్డ్స్, జనవరి 24న జెస్సీ జేన్, ఫిబ్రవరి 15న కాగ్నీ లిన్ కార్టర్, తాజాగా సోఫియా లియోన్ మరణించారు. అయితే వీరందరి మరణాలు సహజ మరణాలు కాదు. అందరూ 45 ఏళ్ళ లోపు వయసున్న వారే. దీనితో అడల్ట్ ఇండస్ట్రీలో ఏం జరుగుతోందో ఎవ్వరికి అర్థం కావడం లేదు.
