Sreeleela Craze : పెళ్లి సందD సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ శ్రీలీల. ప్రస్తుతం టాలీవుడ్లో వరుసగా అవకాశాలను దక్కించుకుంటుంది. పెళ్లి సందD సినిమాలో యాక్టింగ్తో పాటు తన అందచందాలతో వావ్ అనిపించిందీ యంగ్ బ్యూటీ. శ్రీలీల కేవలం గ్లామర్ తోనే కాకుండా నటనతోనూ ఆకట్టుకుంటుంది.
శ్రీలీలను లైమ్ లైట్లోకి తీసుకొచ్చిన దర్శకుడు రాఘవేంద్రరావు అని తెలిసిందే. ఫస్ట్ మూవీ రిజల్ట్ నిరాశపరచడంతో నెక్స్ట్ మూవీస్ విషయంలో ఆచితూచి వ్యవహరించింది శ్రీలీల. దీంతో సెకండ్ మూవీ రవితేజ ధమాకాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది శ్రీలీల. ధమాకాతో ఈ ముద్దుగుమ్మ జోరు పది రెట్లు పెరిగింది. ప్రస్తుతం శ్రీలీల చేతిలో 10 సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు SSMB28 సినిమాలో శ్రీలీల సెకండ్ హీరోయిన్ గా కనిపించబోతుంది. బాలకృష్ణ కూతురి పాత్రలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలోనూ ఈ అమ్మడు నటిస్తోంది. తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా శ్రీలీలనే ఎంపిక చేసారు.
ఇవేకాక మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న సినిమాలో, నితిన్ 32వ సినిమా కోసం శ్రీలీలను ఎంపిక చేసినట్లుగా సమాచారం. నవీన్ పొలిశెట్టి హీరోగా రూపొందుతున్న అనగనగా ఒక రాజు సినిమాలో కూడా శ్రీలీలనే హీరోయిన్. రామ్ పోతినేనికి జోడీగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తోంది శ్రీలీల. ఇవికాకుండా మరి కొన్ని సినిమాలకు కూడా ఓకే చెప్పిండీ అమ్మడు.
కేవలం టాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా నటిస్తుంది. ఒకేసారి పది సినిమాలు చేస్తున్న ఘనత ఈ బ్యూటీకే దక్కుతుంది. ఇంత బిజీ షెడ్యూల్ ఒక పూట ఒక సెట్ లో ఉంటే.. ఇంకో పూట మరో సెట్ లో దర్శనమిస్తుందట శ్రీలీల. ఇవి ఇలాగే మేనేజ్ చేస్తే మరిన్ని సంవత్సరాలు ఈ యంగ్ బ్యూటీ కెరీర్ కి ఎలాంటి డోకలేదని చెప్పవచ్చు.