Thalapathy Vijay : తమిళ హీరో ‘తలపతి’ విజయ్‌కు క్రేజ్ మామూలుగా ఉండదు. తమిళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత.. ఆ స్థాయిలో మాస్ ఫాలోయింగ్ సంపాదించిన హీరోల్లో దళపతి విజయ్ ముందు వరుసలో ఉంటాడు. ప్రెసెంట్ విజయ్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో ‘లియో’ మూవీ తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి విజయ్ బర్త్ డే సందర్భంగా పోస్టర్ ను అలాగే నా రెడ్డి అనే సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాట యూట్యూబ్ ను షేక్ చేసింది.

తలపతి రాజకీయ ప్రవేశంపై గత కొంతకాలంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో అటు కోలీవుడ్తోనూ, ఇటు తమిళ రాజకీయాల్లోనూ ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు విజయ్ అభిమానులు ఏర్పాటు చేసిన ‘విజయ్ మక్కల్ ఇయక్కం (VMI)’ సభ్యులతో జూలై 11న ఆయన సమావేశమయ్యారు. ఈ క్రమంలో విజయ్ పాదయాత్రకు సైతం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
Samajavaragamana OTT : ఓటీటీలోకి వచ్చేస్తున్న సామజవరగమన..
లియో మూవీకి ముందే ఈ పాదయాత్ర ప్రారంభించనున్నట్టు తెలుస్తుంది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్న విజయ్ కొత్త మువీ ‘లియో’ అక్టోబర్ 19న థియేటర్లలో విడుదల కానుంది. సినిమా పరంగా తిరుగులేని ఇమేజ్ ఉన్న విజయ్ సామాజికంగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో తాజాగా తమిళనాడులో ఈ ఏడాది టెన్త్, ఇంటర్ పాసైన తమిళ విద్యార్థులకు “విజయ్ మక్కల్ ఇ యక్కం” తరపున ఒక్కో విద్యార్థికి రూ.10,000 అందజేసిన విషయం తెలిసిందే.