Vijay Deverakonda – Nayan combo Movie : విజయ్ దేవరకొండ అనేకంటే అర్జున్ రెడ్డి అంటేనే ఈజీగా గుర్తుపట్టేలాగా ఒక రౌడీ ఇమేజ్ ని కుర్రకారు లో వదిలి కొత్త ట్రెండ్ సృష్టించి తనకంటూ ఒక క్రేజ్ ని తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ తీసే ప్రతి ఒక్క సినిమా ప్రేక్షకులకు ఎంతో దగ్గరగా ఉంటుంది. తన అందంతో, కొన్నిసార్లు అమాయకత్వపు నటనతో లవర్ బాయ్ ఇమేజ్ నీ సొంతం చేసుకొని అమ్మాయిల గుండెల్లో పాతుకుపోయాడు విజయ్ దేవరకొండ.
ఈమధ్య లవ్, ఫ్యామిలీ స్టోరీస్ తో దూసుకు వెళ్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.. ఖుషితో మంచి హిట్ నీ సొంతం చేసుకున్న విజయ్, రాబోయే “ఫ్యామిలీ స్టార్” సినిమా పై తన ఫోకస్ పెట్టి ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు.. అయితే తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇంత క్రేజీ సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ సినిమాను నయనతార రిజెక్ట్ చేసిందంట…
అవును మీరు విన్నది నిజమే.. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటేనే వేరే లెవెల్ లో ఉండేది.. కానీ నయన్ చేసిన చిన్న మిస్టేక్ వల్ల ఆ కాంబో కాస్త మిస్ అయింది. విజయ్ దేవరకొండ సినీ కెరియర్ లోనే “గీతాగోవిందం” సినిమా ఎంత బిగ్గెస్ట్ హిట్ అనేది మనందరికీ తెలుసు. గీతగోవిందం సినిమా తోనే విజయ్ దేవరకొండ ఫ్యామిలీ ఇమేజ్ నీ అటు లవర్ బాయ్ ఇమేజ్ ని కూడా సొంతం చేసుకున్నాడు. ఆ సినిమాలో రష్మిక, విజయ్ దేవరకొండ జోడి అదరగొట్టి ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసింది.
ఇక ఆ సినిమాకు గాను నయనతారను ముందుగా నిత్యామీనన్ చేసిన పాత్ర కోసం ఫిల్మేకర్స్ సంప్రదించారంట.. కానీ నయన్ మాత్రం ఆ పాత్ర నిడివి చాలా తక్కువగా ఉంది, మళ్లీ ఎక్కువ ఇంపార్టెన్స్ లేని పాత్ర అని రిజెక్ట్ చేసిందంట. నిజానికి ఆ పాత్రని ఆ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. ఆ ప్లేస్ లో ఆ పాత్ర కోసం స్టార్ హీరోయిన్ అయితే బాగుంటుంది.. అందులోనూ నయనతార అయితే ,విజయ్ దేవరకొండకు నయనతారకు కాంబో చక్కగా మిక్స్ అవుతుందని ఆ చిత్ర బృందం భావించారంట..
కానీ నయన్ చేసిన చిన్న మిస్టేక్ వల్ల ఆ సినిమా కాస్త మిస్ అయ్యి.. విజయ్ దేవరకొండ, నయన్ కాంబినేషన్ చూసే అవకాశం మనకు దక్కకుండా పోయింది.. ఇప్పుడు ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.. ఎంత పిచ్చి పని చేశావు నయన్.. నిజంగా నువ్వు చేసిన పని అస్సలు బాగోలేదంటూ.. ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయంపై మీరు ఏమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి..