Custody OTT : గత కొంతకాలంగా అక్కినేని నాగచైతన్య కమర్షియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ‘లవ్‌స్టోరీ’, ‘బంగార్రాజు’ వంటి వరుస హిట్లతో జోరుమీదున్న నాగచైతన్య స్పీడ్‌కు “థాంక్యూ” బ్రేకులు వేసింది. తాజాగా తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో కస్టడీ అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు చైతూ. ఇందులో కృతి శెట్టి హీరోయిన్ కాగా అరవింద్ స్వామి తన విలన్ యాక్టింగ్ తో అదరగొట్టాడు. మాస్ట్రో ఇళయరాజా మరియు లిటిల్ మాస్ట్రో యువన్ శంకర్ రాజా బ్యాక్
గ్రౌండ్ స్కోర్ అందించగా.. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి కస్టడీ చిత్రాన్ని నిర్మించారు. ఎన్నో అంచనాల నడుమ మే 12న గ్రాండ్ గా రిలీజ్ అయినా ఈ చిత్రం మరోసారి అక్కినేని అభిమానులను నిరాశపరిచింది. అయితే థియేట్రికల్ రిలీజ్ ను కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో జూన్ 9న కస్టడీ మూవీ స్ట్రీమింగ్ కానుంది. థియేటర్ లో నిరాశపరిచిన ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.