Guntur Kaaram Trailer Release Date : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో, సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న మాస్ మసాలా సినిమా గుంటూరు కారం. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఇది పాన్ ఇండియా సినిమా కాకపోయినప్పటికీ ఈ సినిమా పైన భారీ అంచనాలే క్రియేట్ అవుతున్నాయి. ఇప్పటికే మహేష్ బాబు లుక్స్ చాలా వైరల్ అయ్యాయి.
ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్న ఈ సినిమా పైన వారి అంచనాలను తారుమారు చేయకుండా ఉండడం కోసం చాలా కష్టపడుతున్నారు టీమ్. అయితే ఈ సినిమాకు భారీ అంచనాలను పెంచడానికి టీమ్ మరొక ఐడియా ని ఆలోచించారు. ఈ సినిమా నుండి ఇప్పటివరకు రెండు సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. అందులో మొదటి సాంగ్ చార్ట్ బస్టర్ కాగా రెండవ సాంగ్ పెద్దగా ఆకట్టుకోలేక పోయింది..

ఈ సాంగ్ విషయంలో ఫ్యాన్స్ నిరాశలో ఉండడంతో ఈ సినిమా ట్రైలర్ గురించి అదిరిపోయే అప్డేట్ వైరల్ అయ్యింది. ఈ సినిమా ట్రైలర్ నీ జనవరి ఒకటో తేదీన రిలీజ్ చేయాలని టీమ్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇంకా ఈ న్యూస్ తో ఫాన్స్ లో ఒక హోప్ క్రియేట్ చేశారు. అందరూ జనవరి 1 వ తేదీ కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. థమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
