Jailer Villain Vinayakan : రజనీకాంత్ ఇటీవల నటించిన జైలర్ సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో మనకు తెలుసు. 600 కోట్ల గ్రాస్ దాటి ఓటిపి, శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్, ఇవన్నీ కలిపితే 1000 కోట్ల క్లబ్లో చేరిపోయింది. అటూ నిర్మాతలకి, సినిమాలో నటించిన వాళ్లకు కూడా మంచి లాభాలే వచ్చాయి. అయితే ఈ నేపథ్యంలో జైలర్ సినిమాలో నటించిన వినాయకన్ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రజనీకాంత్ కి పోటీగా వినాయకన్ నటించి మెప్పించాడు.
విమర్శకులతో కూడా ప్రశంసలు అందుకున్నాడు. వినాయకన్ తన నటనతో.. వినాయకన్ చాలా సినిమాలలో విలన్ గా చేశాడు. అతను మంచి సంగీత దర్శకుడు కూడా.. చాలా సినిమాలలో సహాయ నటుడిగా చేశాడు. కానీ విలన్ గా ఈ సినిమాతో చాలా మంచి గుర్తింపు వచ్చింది. వినాయకన్ మాట్లాడుతూ
‘జైలర్’ లో పాత్ర కారణంగా ధనుష్ నటించిన ‘కెప్టెన్ మిల్లర్’ అవకాశాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అయితే అదంతా మా చేతుల్లో లేదు” అని వినాయకన్ అన్నారు. అయితే జైలర్ సినిమా గాను వినాయకన్ 35 లక్షలు రెమ్యునరేషన్ తీసుకున్నారని వార్త నెట్ ఇంట్లో వైరల్ అయింది. ఈ విషయంపై వినాయకన్ స్పందిస్తూ.. నా రెమ్యునరేషన్ నా ఇష్టానికి తగ్గట్టుగానే జైలర్ టీం
ఇచ్చారని జైలర్ సినిమా షూటింగ్ లో తనకు రాయల్ ట్రీట్మెంట్ కూడా ఇచ్చారని ఆయన వెల్లడించారు. ఇలాంటి పుకార్లను నమ్మవద్దని ఎవరో కావల్సుకొని ఇలాంటి న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారని ఆయన క్లారిటీగా చెప్పారు. వాళ్ళు ఇచ్చిన రెమ్యునరేషన్ తో నేను తృప్తిగా ఉన్నానని ఆయన వెల్లడించారు.