Jr NTR Devara Update : యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ దేవర. ఈ చిత్రంలో శ్రీదేవి కూతురు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తుండగా రత్నవేలు సినిమాటోగ్రఫీ చేస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తాజాగా విడుదలైన పోస్టర్స్ ఒక్కసారిగా ఈ మూవీ హైప్ ని పెంచేసాయి.
ఇటీవల ఈ మూవీ షూట్ కి కొంత గ్యాప్ ఏర్పడగా ఎన్టీఆర్ తన చిన్నపాటి వెకేషన్ ముగించుకొని ఇండియాకి తిరిగి వచ్చాడు. దీంతో నెక్స్ట్ షెడ్యూల్ ప్లాన్ చేశారు మేకర్స్. ఈ షెడ్యూల్ రేపటి నుంచి శంషాబాద్ లో ప్రారంభం కానుంది. 10 రోజుల పాటు అక్కడే ఈ షూటింగ్ కొనసాగుతుంది. ఇప్పటికే బేగంపేట, రామోజీ ఫిల్మ్ సిటీలో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. అయితే లేటెస్ట్ షెడ్యూల్ లో మరో ఎగ్జైటింగ్ సీన్స్ ని ప్లాన్ చేసాడట డైరెక్టర్ కొరటాల.
అంతేకాదు ఈ షూట్ లో తారక్ తో పాటు నటుడు సైఫ్ అలీఖాన్ అలాగే యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ పై ఇంట్రెస్టింగ్ సీన్స్ షూట్ చేయనున్నారట. అలాగే ఎన్టీఆర్ ఈ ఏడాది ఎండింగ్ లోపే తన షూట్ అంతటినీ కూడా కంప్లీట్ చేసేయనున్నాడని సమాచారం. మొత్తానికి దేవర యూనిట్ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో దూసుకెళ్తున్నారని చెప్పొచ్చు. వచ్చే ఏడాది మే లో ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు.