Pawan Kalyan OG Update : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ సుజిత్ కాంబో తెరకెక్కుతున్న తాజా చిత్రం OG. సుజీత్ దర్శకత్వం వహించనున్న ప్రాజెక్ట్ OG పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒక్క అనౌన్స్మెంట్ పోస్టర్‌తోనే సోషల్ మీడియా షేక్ అయింది. సాహో వంటి హై యాక్షన్ ఎంటర్టైనర్ తర్వాత దాదాపు నాలుగేళ్లు గ్యాప్ తీసుకుని సుజీత్ ఈ సినిమాను సిద్ధం చేశాడు. పైగా పవన్‌కు సుజీత్ వీరాభిమాని కావడంతో ఈ సినిమా ఏ లెవల్లో ఉంటుందో అని భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు.
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికరమైన అప్డేట్ ను మేకర్స్ తాజాగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇప్పటికు OG 3వ షెడ్యూల్ హైదరాబాద్‌లో పూర్తయిందని, దీంతో ఇప్పటికి ఈ మూవీ షూట్ 50% కంప్లీట్ అయ్యిందని ప్రకటించారు మేకర్స్. నెక్స్ట్ షెడ్యూల్ వచ్చే నెలలో ప్రారంభం కానుంది.
ప్రియాంక అరుల్ మోహన్, ఇమ్రాన్ హష్మీ, ప్రకాష్ రాజ్, శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్ తదితరులు ఈ మూవీలో కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. RRR ఫేమ్ డి.వి.వి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి ఇదే ఏడాది చివర్లో వచ్చే ఏడాది జనవరిలో కానీ ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
https://twitter.com/DVVMovies/status/1673211695827935233?t=7aHWAfiehH3UA6zVqUGtCQ&s=19