Pushpa 2 Leaked : పుష్ప 1 (ది రైజ్) సెన్సేషనల్ హిట్ అవ్వడంతో పుష్ప 2 (ది రూల్) కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప ది రైజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. పుష్పతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోగా, హీరోయిన్ రష్మిక మందన్నాకు కూడా మంచి గుర్తింపు వచ్చింది. పుష్ప 2 షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా
మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. పుష్ప1 లో రష్మిక శ్రీవల్లి పాత్రకు ప్రాణం పోసింది. పుష్ప 2 లో చనిపోయినట్టుగా ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫోటో చూసిన నెటిజెన్స్ రష్మిక పాత్రను చంపేసారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సంగతి పక్కన పెడితే ఈ మూవీ గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. పుష్ప1 లో రష్మిక శ్రీవల్లి పాత్రకు ప్రాణం పోసింది. పుష్ప 2 లో చనిపోయినట్టుగా ఒక ఫోటో సోషల్
మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫోటో చూసిన నెటిజెన్స్ రష్మిక పాత్రను చంపేసారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ పాత్ర చనిపోవడం వల్ల సినిమా ఏ కీలక మలుపు తిరుగుతుందో చూడాలి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ పాన్-ఇండియన్ మూవీలో ఫహద్ ఫాసిల్, సునీల్, అనసూయ భరద్వాజ్, జగదీష్ తదితరులు నటించారు. 2024 మే లో చిత్రాన్ని విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.