Ram Charan : సినిమా సినిమాకు నిఖిల్ క్రేజ్ పెరుగుతూనే ఉంది. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ ఆడ్రస్‌గా నిలుస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్లతో దూసుకుపోతున్నాడు. కార్తికేయ 2తో సూపర్ హిట్ కొట్టటమే కాకుండా పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు సంపాదించుకున్నాడు నిఖిల్ సిద్ధార్థ్. ఆ తర్వాత వచ్చిన 18 పేజీస్ కూడా డీసెంట్ హిట్ నే సొంతం చేసుకుంది. ఇటీవల వరుసగా పాన్ ఇండియా సినిమాల్లోనే నటించటానికి రెడీ అయ్యాడు.
దానికి తగ్గట్టుగానే యూనిక్ కాన్సెప్టులతో సినిమాలను ఎంపిక చేసుకుంటున్నాడు. ఇప్పటికే నిఖిల్ చేతిలో ఐదు పాన్ ఇండియా మూవీస్ ఉండడం విశేషం. అందులో స్పై మూవీ ఒకటి. ప్రముఖ ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరిదశలో ఉంది. నిఖిల్‌కు జోడీగా సాన్య థాకూర్, ఐశ్వర్య మీనన్‌లు నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు, గ్లింప్స్ సినిమాపై హైప్ ని పెంచేశాయి.
అయితే తాజాగా స్పై మూవీకి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ మూవీలో ఓ పవర్ఫుల్ గెస్ట్ రోల్ కోసం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ను సంప్రదించారట మేకర్స్. దీంతో చరణ్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ వార్తలో నిజమెంతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇదిలావుండగా యూవీ క్రియేషన్స్ సంస్థ విక్రమ్, రామ్ చరణ్ ‘V మెగా పిక్చర్స్’ పేరుతో కొత్త బ్యానర్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ బ్యానర్ లో నిఖిల్ నెక్స్ట్ మూవీ ది ఇండియన్ హౌజ్ ను నిర్మిస్తున్నారు.