Ram Charan New Banner : RRR తో రామ్ చరణ్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అంతర్జాతీయ వేదికలపై అదరగొడుతున్నాడు. అందుకే ఆయన మార్కెట్ కు అనుగుణంగా కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో గేమ్ చేంజర్ మూవీ చేస్తున్నాడు. అయితే ఇప్పటికే చెర్రీ పలు వ్యాపారాల్లో భాగస్వామి అయ్యాడు. రామ్ చరణ్ గతంలో ఒక పోలో టీమ్ (గుఱ్ఱపుస్వారీ) ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత ట్రూ జెట్ పేరుతో ఒక విమానయాన సంస్థను ప్రారంభించాడు. చరణ్ ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు నిర్మాతగాను కొణిదెల ప్రొడక్షన్స్ పేరుతో సినిమాలను నిర్మిస్తున్నాడు. దీనికి తోడు ఇటీవల ఓ క్రికెట్ జట్టును కూడా కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యడని సమాచారం. అయితే తాజాగా మరో నిర్మాణ సంస్థకు శ్రీకారం చుట్టాడు చరణ్. తన స్నేహితుడు విక్రమ్‌తో కలిసి తాజాగా మరో
ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించాడు. యూవీ క్రియేషన్స్ సంస్థ విక్రమ్, రామ్ చరణ్ ఎప్పటి నుంచో మంచి స్నేహితులు. వీరిద్దరూ కలిసి ఇప్పుడు ‘V మెగా పిక్చర్స్’ పేరుతో కొత్త బ్యానర్‌ను ప్రారంభించారు. ‘V మెగా పిక్చర్స్’ బ్యానర్‌పై తీయనున్న చిత్రాల్లో కొత్త నటీనటులకు, యంగ్ టాలెంటెడ్ ని ప్రోత్సహించనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
https://twitter.com/UV_Creations/status/1662077886646603780?t=AZfPbGAnzJsdm3Jnt6qPFw&s=19