Rashmika : శాండిల్ వుడ్ బ్యూటీ రష్మిక గురించి మనకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతున్న ఈ అమ్మడు తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుస అవకాశాలను అందుకోవడం విశేషం. ఇప్పటికే మిషన్ మజ్ను, గుడ్ బై లాంటి సినిమాలలో నటించిన రష్మిక సినిమాలు విజయవంతం కాలేకపోయాయి. ప్రస్తుతం తదుపరి చిత్రం పైన తను ఫోకస్ ని పెట్టింది.
బాలీవుడ్ లో నిర్మితమవుతున్న యనిమాల్ మూవీలో హీరో రణబీర్ కపూర్ కీలకపాత్ర పోషిస్తు..హీరోయిన్ గా రష్మీక నటిస్తున్న సినిమాకు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పుడు రష్మిక ఆశలన్నీ ఈ సినిమా పైనే ఉన్నాయి. అయితే ఈ మధ్యనే రణబీర్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలై, ఆ సినిమా పైన అంచనాలను భారీగా పెంచేసిందని చెప్పవచ్చు.
మరోవైపు రష్మిక ఫస్ట్ లుక్ నీ కూడా విడుదల చేశారు. ఆమె మరాఠీ గృహిణిగా, మెడలో తాళిబొట్టు, పట్టుచీరలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. డిసెంబర్ ఒకటో తేదీన సినిమా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుందని సమాచారం.
ఇది పూర్తిగా యాక్షన్ త్రిల్లర్ గా ఉంటుందని చెప్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ పైన మంచి పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఈ సినిమాకి సంబంధించి పారితోషకం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా నిలవడం మరో విశేషం. రణబీర్ కపూర్ ఈ సినిమాకి గాను 70 కోట్లు పారితోషకాన్నీ తీసుకున్నట్లు ఒక వార్త హల్చల్ చేస్తుంది. అలాగే రష్మిక కూడా 4 కోట్ల పారితోషకాన్ని తీసుకున్నట్టు ఒక న్యూస్ వైరల్ అవుతుంది.
ఇప్పటికే అధిక పారితోషకం తీసుకునే హీరోయిన్లలో రష్మీక కూడా ఒకరు. ఈ సినిమాను డిసెంబర్ ఒకటో తేదీన రిలీజ్ చేయాలని చూస్తున్నారు. అలాగే తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా ఈ సినిమాలు విడుదల చేయడానికి భారీ సన్నాహాలు చేస్తున్నారు. చూడాలి ఈ సినిమాతో నైనా రష్మిక బాలీవుడ్ లో హిట్ నీ తన ఖాతాలో వేసుకుంటుందో..లేదో..