The Kerala Story OTT Release Date : వివాదాల నేపథ్యంలో విడుదలైన ది కేరళ స్టోరి చిత్రం రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ ను బద్దలుకొట్టింది. చిన్న బడ్జెట్ తో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం టీజర్, ట్రైలర్ విడుదలతో ఈ సినిమాకు వివాదాలు చుట్టుముట్టాయి. సినిమా కాస్త రాజకీయరంగును పులుముకొని భారీ వివాదానికి తెరలేపింది.
కేవలం 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ది కేరళ స్టోరీ సినిమా మొదటిరోజే 8 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. 8వ రోజుకు 100కోట్లకు పైగా వసూలు చేసి 200 కోట్ల దిశగా దూసుకుపోతుంది. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో ఈ సినిమా ఇంకా థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూ ఇప్పటికే3 230 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
డైరెక్టర్ సుదీప్తో సేన్ తెరకెక్కించిన ఈ సినిమాలో అదా శర్మ ప్రధాన పాత్రలో నటించింది. ఇదిలావుండగా ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతుంది. ఈ చిత్రం జీ 5 లో ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి రెడీగా ఉంది. జూన్ 23 వ తేదీ నుండి ఈ చిత్రం జీ 5 లో తమిళం, తెలుగు, హిందీలో ప్రసారం కానుంది.