Vikram Thangalan Movie Teaser : విభిన్న పాత్రలు ఎన్నుకోవడంలో చియాన్ విక్రమ్ ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు. ఆయన నటించిన అపరిచితుడు అందుకు నిదర్శనం. తర్వాత వచ్చిన “ఐ” సినిమాలో విక్రమ్ మనకు డిఫరెంట్ గెటప్ లో కురిపి పాత్రలో కనిపించారు. ఆ సినిమా ఆశించినంత విజయాన్ని పొందకపోయినప్పటికీ, ఆయన ఎంచుకున్న పాత్ర, ఆయన నటించే పాత్ర కోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటాడు అని నిరూపించింది.
ప్రజెంట్ విక్రమ్, పా రంజిత్ దర్శకత్వంలో “తంగలాన్” సినిమాలో నటిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఆ సినిమా టీజర్ లో విక్రమ్ గెటప్ చూస్తే ఒళ్ళు జలజరించడంతోపాటు, ఆ సినిమా పైన హోప్స్ ని పెంచేస్తుంది. ఆ టీజర్ లో విక్రమ్ చాలా వైల్డ్ గా కనిపించాడు. ఆయన వేషధారణ ఒకత్తూయితే ఆయనను చూపించిన సన్నివేశాలలో ఏకంగా విక్రమ్ ఎదురు వచ్చిన వాళ్లను నరుక్కుంటూ వెళ్లిపోతూ, చేతులతో పామును చీల్చిన సన్నివేశాలను ఒక్క డైలాగ్ కూడా లేకుండా ఓన్లీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో విడుదల చేశారు.
అవి చూస్తుంటే రోమాలు నిక్కబోడచడంతో పాటు, ఒక టీజరే ఇలా ఉంటే సినిమా ఇంకెలా ఉంటుందో అన్నంత ఆసక్తిని ప్రేక్షకులలో రేకెత్తిస్తుంది. ఇక సినిమా కథ విషయానికొస్తే బంగారు గనుల వద్ద ఉండే గ్రామస్తులకు, బ్రిటిష్ వారికి మధ్య జరిగే యుద్ధం నేపద్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. పా రంజిత్ తనదైన దర్శకత్వ శైలిలో స్వేచ్ఛ కోసం పోరాటం ఎలా ఉంటుందో చూపించబోతున్నాడు.
కార్మికుల కోసం పోరాడే ముఖ్య నాయకుడి పాత్రలో విక్రమ్ నటిస్తున్నారు. విక్రమ్ గెటప్పు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ అన్ని కూడా ప్రత్యేక ఆకర్షణగా టీజర్ లో కనిపిస్తున్నాయి. ఇక చివర్లో… “రక్తపాతం జరిగే యుద్ధాలతో స్వేచ్ఛ లభిస్తుంది. సన్ ఆఫ్ గోల్డ్ ఉదయిస్తున్నాడు.” అనే క్యాప్షన్ ని పెట్టారు.
స్టూడియో గ్రీన్, నీలం ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాకి జీవి ప్రకాష్ మ్యూజిక్ ని అందిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో ముఖ్య తారాగణంగా పార్వతి తిరువోతూ, మాళవిక మోహన్, పశుపతి, డేనియల్ కల్ట్ గిరోన్ నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో భారతీయ బహుళ,విదేశీ భాషల్లో నిర్మితమవుతున్న ఈ సినిమాని వచ్చే సంవత్సరం విడుదల చేయాలని ఫిల్మ్ మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు..