KCR Words about Andhra : తెలుగు రాష్ట్రాలు విడిపోతున్నప్పుడు నిజానికి ఆంధ్ర ప్రజలు కూడా తెలంగాణ వాళ్ళని చూసి “స్టేట్ విడిపోతే మీ పరిస్థితి కష్టం.. అసలు మీరేమైపోతారు..? కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది..? చీకట్లో మగ్గిపోతారు. హైదరాబాద్ తప్ప ఇక్కడ ఏముంది..? ఇలా రకరకాలుగా అంటూ కొంతమంది గేలి చేస్తూ మాట్లాతే.. మరికొందరు జాలి పడుతూ మాట్లాడారు..
ఫైనల్ గా ఇప్పుడు ఏమైంది..? ఎవరు పరిస్థితి ఏంటి? అనేది ఒకసారి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అట్టడుగుకుచేరింది. కనీసం రోడ్లు కూడా వేయని దుస్థితి. తెలంగాణ సీఎం కేసీఆర్ సరిగ్గా దీన్నే చూపిస్తూ “డబుల్ రోడ్డు వచ్చిందంటే తెలంగాణ.. సింగిల్ రోడ్ వచ్చిందంటే ఆంధ్ర..” అంటూ ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని చెప్పకనే చెప్పారు. తమ అభివృద్ధిని ఎవరితో అయితే విడిపోయామో వారితోనే కంపేర్ చేసుకోమని చెబుతున్నారు.
“ఎక్కువ చెప్పనని వాళ్ల రోడ్లు ఎట్లా ఉన్నాయో మన రోడ్లు ఎట్లా ఉన్నాయో చూసుకోండి..” అని అన్నారు. అసలు దీనికి మించిన అవమానం ఉందా..? కెసిఆర్ కంటిన్యూ చేస్తూ “మేం పోతే మీకు బ్రతకడం వస్తుందా.? పరిపాలన మీకు చేతనవుతుందా..?” అన్నారు.. అలా అన్నవాళ్లే ఇప్పుడు మన దగ్గరకు వచ్చి ధాన్యం అమ్ముకుంటున్నారు. ఎందుకంటే మనం అయితే పేమెంట్ ఇమీడియట్గా ఇస్తున్నాం.
అక్కడ ధాన్యం డబ్బులు వెంటనే రావు అంటూ ఆంధ్ర రైతుల దుస్థితి వివరించారు. తెలంగాణ విడిపోతే మీకు కరెంటు ఉండదు చీకట్లో బతకాలి అని అన్న నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాటలు గుర్తు చేస్తూ..”ఇప్పుడు ఎవరు చీకట్లో ఉన్నారు.. ఆంధ్రానా.? తెలంగాణనా..?” అంటూ ప్రశ్నించారు. ఇలా ఏడ్చింది ఆంధ్రా పరిస్థితి.
నిజం చెప్పాలంటే కెసిఆర్ మాటల్లో 100% వాస్తవం ఉంది రాష్ట్రంలో రోడ్లు ఎక్కడ చూసినా గోతులే.. రైతుల గురించి కూడా ఆయన మాట్లాడింది కరెక్టే విద్యుత్ పరిస్థితి కూడా అంతే.. ఇంకా నయం రాజధాని గురించి మద్యపాన నిషేధం గురించి మాట్లాడలేదు సంతోషం అవి కూడా మాట్లాడితే తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితి ఆంధ్ర వాళ్ళది..!!