Purandeshwari Press Meet : వైయస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచి, తెలంగాణలో అభివృద్ధితో పోల్చుకుంటే, ఆంధ్రాలో జగన్ చేస్తున్న అభివృద్ధి ఏమీ లేదంటూ, జగన్ పరిపాలనను ఎద్దేవా చేస్తూ మొన్ననే కేసిఆర్ చురకలు అంటించిన విషయం మనకు విధితమే. ఈ నేపథ్యంలోనే మరోమారు బిజెపి ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కూడా జగన్ అభివృద్ధి పేరుతో చేస్తున్న మోసాలను బట్టబయలు చేశారు.
దగ్గుబాటి పురందేశ్వరి అంతపురం జిల్లాలో పర్యటించారు. తదుపరి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను బయటపెట్టి అభివృద్ధి పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు అని తెలిపారు. ఒకవైపు అనంతపురం జిల్లాలో కరువు విలయతాండవం చేస్తుంటే, జగన్ ప్రభుత్వం మాత్రము ప్రజలకు మేలు చేసినట్లు ప్రచారంలో చెప్పుకుంటుంది.. అని పురందేశ్వరి జగన్ ప్రభుత్వం పైన ఘాటు విమర్శలు చేశారు.
పోయినసారి ఎన్నికల వేళ ప్రచార సమయంలో రైతులకు అనేక హామీలు ఇచ్చిన జగన్ ప్రభుత్వం ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆమె తెలిపారు. బటన్లు నొక్కుతూ రైతులను, ప్రజలను మోసం చేసే దిశగానే వారి పరిపాలన ఉందని, హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా 3 లక్షల 45 వేల ఎకరాలకు సాగు, తాగు నీరు అందిస్తామన్న వైఎస్ జగన్ హామీ ఏమైందని ఆమె నిలదీశారు.
ఇదిలా ఉంటే మరోవైపు శీతల గిడ్డంగులు ఏర్పాటు చేస్తామని చెప్పినా జగన్ ప్రభుత్వం, ఏపీలో ఎక్కడ కూడా ఏర్పాటు చేయలేదని, మాయమాటలు చెప్పి ప్రజలను మభ్యపెడుతూ ఆ ముసుగులోనే వైయస్ జగన్ ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుందని, ఇప్పుడు ఎన్నికలు రాగానే మళ్లీ ప్రజలు గుర్తుకు వచ్చి ప్రజలకు ఏదో మేలు చేసినట్టు నటిస్తుందని పురందేశ్వరి వెల్లడించారు.