Varahi VijayaYathra : వారాహి విజయయాత్ర విరామం లేకుండా దూసుకుపోతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ స్వల్ప అస్వస్థతకు గురైనప్పటికీ ప్రజా సమస్యల దృష్ట్యా ఆయన వెంటనే తన యాత్రను తిరిగి ప్రారంభించారు. వారాహి విజయయాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ పశ్చిమగోదావరి జిల్లాలో నిర్వహిస్తున్న సమావేశాల నేపథ్యంలో భీమవరంలో సమావేశం నిర్వహించారు.
ఈ యొక్క సమావేశంలో చాలా సమస్యలు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నిర్వహించిన పోలీసు నియామక రాత పరీక్షలో నాలుగు ప్రశ్నలు తప్పుగా వచ్చాయని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. పరీక్ష కీ విడుదల చేసినప్పుడే అభ్యంతరాలు చెప్పినా ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం స్పందించలేదని ఆయన అన్నారు.
తెలంగాణ నుంచి వచ్చిన కొందరు అభ్యర్థులు ఈ రోజు భీమవరంలో నన్ను కలిసి విజ్ఞాపన అందచేశారు అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. నాలుగు ప్రశ్నలపై అభ్యంతరాలు చెబుతూ ప్రామాణిక పుస్తకాలను కూడా ఆధారాలుగా చూపించినా పరిగణించడం లేదని ఆయన ఆవేదన చెందారు. అలాగే ఈ.డబ్ల్యూ.ఎస్. రిజర్వేషన్ అంశాన్నీ నా దృష్టికి తీసుకువచ్చారు.
పోటీ పరీక్షల్లో ప్రతి ఒక్క మార్కు ఎంతో విలువైనది. తమ జీవితాలను ఆ ఒక్క మార్కు మారుస్తుందని తెలంగాణ నుంచి వచ్చిన ఆ యువకులు ఆందోళనతో చెప్పారు అని పవన్ కళ్యాణ్ తెలిపారు. వీరి అభ్యంతరాలను, ఆవేదనను సానుకూల దృక్పథంతో పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారికి, రాష్ట్ర మంత్రి కె.టి.ఆర్.గారికి విజ్ఞప్తి చేస్తున్నాను అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.