Custody Movie Review : నటీనటులు : అక్కినేని నాగ చైతన్య, కృతి శెట్టి, అరవింద్ స్వామి, శరత్ కుమార్, ప్రియమణి తదితరులు
దర్శకుడు : వెంకట్ ప్రభు
నిర్మాతలు : శ్రీనివాస చిట్టూరి
మ్యూజిక్ : ఇళయరాజా, యువన్ శంకర్ రాజా
సినిమాటోగ్రఫీ : ఎస్ ఆర్ కతిర్
అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ కస్టడీపై అక్కినేని అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కావడంతో యాక్షన్, థ్రిల్లర్ మూవీ లవర్స్ ఈ చిత్రం కోసం కొన్నాళ్లుగా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న చైతూ మాస్ ఇమేజ్ కస్టడీ ద్వారా సొంతం చేసుకున్నాడో లేదో చూద్దాం..
కథ:
శివ(నాగ చైతన్య ) నిజాయితీ గల కానిస్టేబుల్, తను ప్రేమించిన రేవతి (కృతి శెట్టి)ని వివాహం చేసుకొని సంతోషంగా ఉండాలని అనుకుంటాడు. అయితే సఖినేటి పల్లి పోలీస్ స్టేషన్లో రాజన్న ( అరవింద్ స్వామి) ని అరెస్ట్ చేసి ఉంచుతారు, అప్పుడు డ్యూటీ లో ఉన్న శివకి రాజన్నని ఎవరో చంపేస్తున్నారు అనే విషయం తెలుస్తుంది.
మరోవైపు వైపు రేవతికి వేరే పెళ్లి నిశ్చయించారని తెలుస్తుంది. దీంతో శివ ఎలాగైనా న్యాయాన్ని గెలవాలని రాజన్నని కోర్ట్ లో అప్పగించేందుకు అదే రాత్రి, ఇటు రేవతి తో పాటు రాజన్నని కూడా తీసుకెళ్తాడు. దీంతో శివ రాజన్నల కోసం పోలీసుల వెతుకులాట జరుగుతుంది. అయితే రాజన్నని చంపాలనుకున్నది ఎవరు, శివ పోరాటం ఫలిస్తుందా అనేది థియేటర్లో చూడాల్సిందే..
రివ్యూ :
కస్టడీ కమర్షియల్ చిత్రమే అయినా, ఒక రెగ్యులర్ కమర్షియల్ చిత్రంలా లేకపోవడం ఈ చిత్రం ప్రత్యేకత! ఒక మాములు కానిస్టేబుల్ ఒక విలన్ చనిపోకుండా కాపాడటం అనే పాయింట్ ని చాలా ఆసక్తికరంగా ఉంది. ఫస్టాఫ్ లో కొంత హీరో మరియు హీరోయిన్ లవ్ ట్రాక్ ఉన్నప్పటికీ, మిగతా అంత ఎంగేజింగ్ ఉంటుంది. అందులోనూ ఈ కథ నాలుగు రోజుల్లో జరుగుతూ ఉంటుంది, శివ, విలన్ ని కాపాడ్డానికి చేసి ప్రయత్నం, ఇటు శివ ప్రేయసి రేవతి కూడా శివతో పాటే ఉండటం, పోలీసులు వీళ్ళ కోసం వెతకటం, ఇదంతా ఉత్కంఠభరితంగా సాగుతుంది.
శివ పాత్రలో నాగ చైతన్య మొదట్లో కొంచెం సెట్ అవ్వనట్లు అనిపించినా, ఎప్పుడైతే కథలో లీనమయ్యాక, శివ పాత్రతో కనెక్ట్ అయిపోతాం. నటన విషయంలో చైతూ ఇంకో మెట్టు ఎక్కాడనే చెప్పొచ్చు, ఇక కృతి శెట్టి రేవతి పాత్రలో ఉన్నంతలో పర్వాలేదానిపించింది, నాగ చైతన్యకి సమానంగా స్క్రీన్ టైం ఉన్న అరవింద్ స్వామి అద్భుతంగా తన పాత్రని పండించాడు, శరత్ కుమార్ పర్వాలేదు, ఇక మిగిలిన తారాగణం వారి పాత్రల మేరకు మెప్పించారు.
వెంకట్ ప్రభు తమిళ్ లో మంచి దర్శకుడని పేరు, అయితే తెలుగు ప్రేక్షకులకి అనుగుణంగా, ఇటు తమిళ ప్రేక్షకులకి అనుగుణంగా ఈ చిత్రాన్ని బాగా ప్రెసెంట్ చేసారు. అయితే కథ, కథనం అంత బాగున్నప్పటికీ, చిత్రంలో అక్కడక్కడా తమిళ్ నేటివిటీ కనిపిస్తూ ఉంటుంది. సాంకేతికంగా కస్టడీ చిత్రం బాగుంది, ఇక ఎస్ ఆర్ కతిర్ ఛాయాగ్రహణం సినిమాకి మంచి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు, ఇక ఇళయరాజా మరియు యువన్ శంకర్ రాజా పాటలు అంతగా ఆకట్టుకోవు కానీ BGM అదిరిపోయింది.
ప్లస్ పాయింట్స్:
* నాగ చైతన్య నటన
* యువన్ శంకర్ రాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్
* యాక్షన్ ఎపిసోడ్స్
మైనస్ పాయింట్స్ :
* స్క్రీన్ ప్లే
* సెకండాఫ్లో ఔట్ డేటెడ్ సీన్స్
రేటింగ్ : 2.75/5
ట్యాగ్ లైన్ : ఓవర్ ఆల్ గా.. కస్టడీ మూవీ మంచి ఇంటెన్స్ యాక్షన్ డ్రామా..