జనసేన పార్టీ ఎన్నికల అనంతరం ఘోర పరాజయాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజలకు సంబంధించిన అన్ని సేవా కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటూనే ఉంది. కరోనా సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా నిత్యావసరాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. వేలాదిమంది జనసైనికులు ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఇటు గోదావరి వరద సహాయ చర్యల్లో కూడా జనసేన తనదైన పాత్ర పోషించిన సంగతి అందరికీ తెలిసిందే.
ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ అందక మరణానికి గురవుతున్నచాలా మంది రోగుల అవస్థలు గమనించిన జనసేన పార్టీ కార్యకర్తలు ఆక్సిజన్ సిలిండర్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకి ఆక్సిజన్ సిలిండర్ పంపిణీ కార్యక్రమాన్ని సమకూర్చి ప్రభుత్వానికి అండగా నిలిచారు. ఈ బృహత్తర కార్యక్రమానికి అన్ని వర్గాల నుంచీ ప్రశంసలు లభిస్తున్నాయి.
పంపిణీ కార్యక్రమం నిరంతరం కొనసాగుతూనే ఉన్నా ప్రధాన మీడియాలో దానికి సంబంధించిన వార్తలు ప్రసారం కావడం లేదని తాము చేస్తున్న పని ఆత్మసంతృప్తి కోసం అయినా మీడియాకి ఇటువంటి పక్షపాత ధోరణి తగదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీడియా ధర్మాన్ని పాటించకపోవడం ఎంతవరకు సమంజసమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా తన సేవా కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ స్పూర్తితో కొనసాగుతునే ఉంటాయని వారు స్పష్టం చేశారు.