Continent of Europe : యూరప్ ఖండం గురించి శాస్త్రవేత్తలు ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించారు.జూన్ 19వ తేదీన ప్రపంచ వాతావరణశాఖ ఒక నివేదికను బహిర్గతం చేసింది. దాంట్లో ప్రపంచంలోనే అత్యధికంగా వేడెక్కుతున్న ఖండంగా యూరప్ మారుతుందని వారు వెల్లడించారు . ప్రపంచ వాతావరణ సంస్థ అయినటువంటి యూరోపియన్ యూనియన్ కు చెందిన కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ రిపోర్ట్ వెల్లడించిన దాని ప్రకారం..
యూరోపియన్ ఖండంలో భవిష్యత్తులో ఉష్ణోగ్రతల పెరుగుదల, సముద్ర ఉపరితల వాతావరణాల రికార్డు స్థాయిలో మార్పులు లోనవుతాయని వెల్లడించింది. హిమాలయాలు కరుగుతుండడంతోపాటు, ప్రపంచంలో పంటలు ఎండిపోవడం, భూగర్భ జలాలు అడుగంటి పోవడం కరువు పరిస్థితులు ఎక్కువగా ఏర్పడే అవకాశాలు ఉంటాయని వెల్లడించింది. యూరప్ ఖండం 1980 నుంచే ప్రపంచ సగటు
కంటే రెండింతలు వేడెక్కడం ప్రారంభించిందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇటలీ, పోర్చుగల్, జర్మనీ, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్ డమ్, స్పెయిన్ వంటి దేశాలలో కూడా గత సంవత్సరం ఉష్ణోగ్రతలను రికార్డు స్థాయిలో మించి నమోదు అయ్యాయి. ది స్టేట్ ఆఫ్ ది క్లైమేట్ ఇన్ యూరప్ 2022 నివేదికలో, 16,000 మంది గత సంవత్సరం తీవ్రమైన వేడి వల్ల మరణించారని తేలింది. అయితే ఉత్తర అర్ధగోళంలో ధ్రువాల చుట్టూ ప్రాంతాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి.
ఈ అత్యధిక వేడి వల్ల వరదలు, నష్టాలు సంభవించడమే కాక తుఫానుల కారణంగా రెండు బిలియన్ డాలర్ల నష్టం సంభవించిందని WMO సెక్రటరీ జనరల్ పెట్టేరీ తాలస్ తెలిపారు. ఇప్పటికైనా ప్రపంచం వెంటనే అలర్ట్ కాకపోతే భవిష్యత్తులో ఈ సమస్యను ఎదుర్కోవడం చాలా కష్టతరం అవుతుంది. హీట్ వేవ్ లతో, తీవ్రమైన వాతావరణ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని పర్యావరణ శాస్త్రవేత్తలు ఆందోళన చెందడంతో పాటు హెచ్చరిస్తున్నారు.