Electric Slippers : బయట సమాజంలో ఆడపిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఊహించగలం. చాలామంది పోకిరీలు వాళ్లను నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఏడిపించడం ,అల్లరి చేయడం లాంటి పనులు చేస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితులలో పాపం ఆడపిల్లలు ఏమి చేయలేక ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. కానీ ఇకమీదట అమ్మాయిలు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. అల్లరి చేసే పోకిరిలకు చెప్పు దెబ్బతో సమాధానం చెప్పవచ్చు.
అది కూడా మామూలు చెప్పుదెబ్బ కాదు ఎలక్ట్రిక్ చెప్పులతో..ఒక్క దెబ్బతో షాక్ కొట్టి ఆ పోకిరీలు గిలగిలా కొట్టుకోవాల్సిందే. మరి ఆ ఎలక్ట్రిక్ చెప్పుల వెనుక ఉన్న కథకమిషూ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఆడపిల్లలతో అసభ్యంగా ప్రవర్తించే పోకిరీలను చూసి అమ్మాయిలు మౌనంగా తలదించుకోవాల్సిన అవసరం లేదు. ఆ పోకిరి మూకుల ఆట కట్టించే పనిలో భాగంగా ఇంటర్మీడియట్ చదువుతున్న ఒక విద్యార్థి వినుత్న ఆవిష్కరణ చేసాడు.
ఝార్ఖండ్ ఛత్రాకు చెందిన మంజీత్ కుమార్ అనే ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థి బస్సుల్లో, రోడ్లమీద, మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూసి, పోకిరీలు వాళ్ళని ఇబ్బందుల గురిచేయడం చూసి అద్భుతమైన పరికరాన్ని కనిపెట్టాడు. ‘విమెన్ సేఫ్టీ డివైజ్’ అనే ఎలక్ట్రిక్ చెప్పులను ఆవిష్కరించాడు. మహిళలు, బాలికలు ఆపద సమయాల్లో ఉన్నప్పుడు ఈ చెప్పులు వాళ్లకు రక్షణ కవచంగా పనిచేస్తాయని,
ఈ ఎలక్ట్రిక్ చెప్పులు ధరించిన కాళ్లతో ఆ పోకిరిలను తంతే..220 నుంచి 300 వోల్ట్ల షాక్ వారికి తగిలి అక్కడికక్కడే కింద పడిపోతారని.. చెప్పులు పనిచేసే తీరును మంజిత్ కుమార్ వివరించాడు. ఆ సమయంలో ఆపదలో ఉన్న మహిళ అక్కడ నుండి తప్పించుకోవడానికి అవకాశం దొరుకుతుంది ఈ ఎలక్ట్రిక్ చెప్పులు వాళ్లకి ఎంతగానో ఉపయోగపడతాయని నమ్మకంతో వీటిని తయారు చేశానని మంజిత్ సంతోషంగా చెప్పారు.
నిర్భయ వంటి ఘటనలు చూసినప్పుడు తను చాలా చెల్లించిపోయానని అలాంటి ఘటనలు మళ్లీ పునరావృత్తం కాకుండా ఉండాలనే ఆలోచనతోనే ఎలక్ట్రిక్ చెప్పులను తయారు చేశానని మంజిత్ వివరించాడు. మంజిత్ చెప్పులను తయారు చేసిన విధానాన్ని వివరించాడు…ఎలక్ట్రిక్ చెప్పులు తయారు చేయడానికి మాములుగా మనం వేసుకునే చెప్పులనే ముడిసరుకుగా వినియోగించినట్టు మంజిత్ చెప్పాడు.
చెప్పుల కింది భాగంలో నాలుగు బ్యాటరీలు, స్విచ్ సహా మరికొన్ని చిన్న పరికరాలను అమర్చాడు. అరగంట ఛార్జింగ్ పెడితే రెండు రోజుల వరకు ఈ చెప్పులను వాడుకోవచ్చు.మంజిత్ రూ.500లకే ఈ డివైజ్ను తయారు చేయడం మరో విశేషం.