Railway Track : రైలు నడిచే ట్రాక్ ఎలా ఉంటుంది. రెండు పట్టాలతో ఉంటుంది కదా.. ఇప్పటివరకు మనకు తెలిసింది అదే. రెండు ట్రాక్ లపై రైలు నడుస్తుంది. కానీ ఎప్పుడైనా మూడు ట్రాక్ లపై రైలు నడవడం చూశారా..! అలా రైలు నడిచే దేశం కూడా ఒకటి ఉంది. ఆసియాలో రైల్వే నెట్వర్క్ అతిపెద్ద జాబితాలో భారతీయ రైల్వే మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలోనే నాలుగు అతిపెద్ద రైల్వే నెట్వర్క్ లు భారతదేశంలో కలవు.
ఈ రైల్వే గుండా ప్రతిరోజు 13 వేలకు పైగా ప్యాసింజర్ రైళ్లు నడుస్తున్నాయి. దాదాపు 7వేలకు పైగా ఉన్నా రైల్వే స్టేషన్ల గుండా రైళ్ళు ప్రయాణిస్తున్నాయి. అయితే ఏ దేశంలో రైలు మూడు ట్రాక్ లపై నడుస్తోందో ఇప్పుడు తెలుసుకుందాం..భారతదేశం యొక్క పక్క దేశమైనటువంటి బంగ్లాదేశ్ లో రైళ్లు మూడు ట్రాక్ లపై నడుస్తాయి. ఇక్కడ రైల్వేలు బంగ్లాదేశ్ ప్రభుత్వంచే నిర్వహించబడుతున్నాయి,
వాటి మొత్తం పొడవు 2,855 కి.మీ. ఇక్కడ రెండు ట్రాక్ ల పైన నడిచే రైలును బ్రాడ్ గేజ్ అని పిలుస్తారు. బంగ్లాదేశ్ లో డ్యూయల్ గేజ్ లను రైలు నడపడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఈ ట్రాక్ లో మూడు ట్రాక్ లు ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్క రైల్వే ట్రాక్ దాన్ని గేజ్ ప్రకారం తయారు చేయబడుతుంది. అందువల్ల ట్రాక్ వెడల్పు వివిధ భాగాలలో మారుతూ ఉంటుంది. బంగ్లాదేశ్ లో మూడు రకాల రైల్వే ట్రాక్‌లు ఉన్నాయి. అందులో ఒకటి బ్రాడ్ గేజ్, మీటర్ గేజ్, డ్యూయల్ గేజ్.
అయితే గతంలో ఇక్కడ మీటర్ గేజ్, బ్రాడ్ గ్రేజ్ మాత్రమే నడిచేవి. కానీ కాలం మారుతున్న కొద్ది వాటి పరిస్థితులలో మార్పు వచ్చింది. బంగ్లాదేశ్ నుండి పాత ట్రాక్ మార్చడం సరైనదని అక్కడివారు భావించలేదు.దానికి కారణం లోకోమోటివ్ల నుంచి కోచ్‌లకు కూడా మార్చాల్సి ఉంటుంది. అలా మారిస్తే రైల్వే పై మరింత భారం పడుతుంది. అందుకే బంగ్లాదేశ్ ప్రభుత్వం డ్యూయల్ గేజ్ నే వాడకంలో ఉంచారు.
ఈ డ్యూయల్ గేజ్ ఏమిటి అంటే..డ్యూయల్ గేజ్, బ్రాడ్ గేజ్, మీటర్ గేజ్ తో రూపొందించబడింది. రెండు రకాల రైల్వే ట్రాక్ లాల్లో రెండు వేరు, వేరు గేజ్ రైళ్ళు ఒకే ట్రాక్ పై నడుస్తాయి. మూడవది సాధారణంగా ఉండే గేజ్. కామన్ గేజ్ వివిధ గేజ్ ల కార్లకు ఉపయోగపడుతుంది. బంగ్లాదేశ్ తో పాటు డ్యూయల్ గేజ్ ఉపయోగించే మరికొన్ని దేశాలు కూడా ఉన్నాయి.