Second Saturday : సెలవులు అంటే అందరూ చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు సెలవులు వస్తాయా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఆదివారం మాత్రమే కాకుండా, ప్రతి రెండో శనివారం సెలవు ఉంటుంది. మరీ ఈ రెండో శనివారాన్ని సెలవు దినంగా ప్రకటించడానికి కారణం ఏమిటి.. ఎప్పుడైనా ఆలోచించారా.. భారతదేశంలో ఈ రెండో శనివారాన్ని సెలవు దినంగా ప్రకటించారు. దీని వెనక ఒక ఆసక్తికరమైన కథ దాగి ఉంది.
19వ శతాబ్దంలో ఒక బ్రిటిష్ అధికారి దగ్గర ఎంతో నిజాయితీగా పనిచేసే ఒక వ్యక్తి ఉండేవాడంట. అతను సెలవు దొరికితే వెంటనే తన తల్లిదండ్రులను కలుసుకోవడానికి తన ఊరు వెళ్లేవాడంట. అలా కొన్నాళ్ళు జరిగిన తర్వాత రోజులు గడుస్తున్నా కొద్దీ అతడు బాధ్యతలు కూడా ఎక్కువైపోయాయి. దాంతో సెలవులు తగ్గిపోవడం వల్ల పని ఎక్కువైందంట. అలాంటి పరిస్థితుల్లో ఆ కొడుకుని చూడడానికి ఆ తల్లిదండ్రులే అతని దగ్గరికి వచ్చేవారట. తమ కొడుకుకి సెలవు ఇచ్చి తమతో పంపించాలని ఆ తల్లిదండ్రులు, ఆ అధికారిని వేడుకున్నారంట.
తన దగ్గర పని చేస్తున్న అధికారి ఎంతో నిజాయితీ, నిబద్ధతతో పనిచేయడం గమనించిన బ్రిటిష్ అధికారి ఎంతో సంతోషించి, అతన్ని మెచ్చుకొని తన వల్ల ఆ వ్యక్తి అతని తల్లిదండ్రులను కలుసుకోలేకపోతున్నాడని బాధపడి వెంటనే ఆ బ్రిటిష్ అధికారి రెండో శనివారాన్ని సెలవు దినంగా ప్రకటించేసాడంట. అప్పటినుండి భారతదేశంలో రెండవ శనివారాన్ని సెలవుగా ఇప్పటికీ పాటిస్తున్నారు.