SLVC Sudhakar Cherukuri : పడి పడి లేచే మనసు, ఆడాళ్లు మీకు జోహార్లు, విరాటపర్వం, రామారావు ఆన్ డ్యూటీ, దసరా వంటి ప్రతిష్టాత్మక చిత్రాలను నిర్మించింది శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (SLVC). గత కొంతకాలంగా సరైన హిట్ లేని ఈ బ్యానర్ ఒక్కసారి దసరా మూవీతో వంద కోట్లు కొల్లగొట్టింది. అయితే ఇదే ఆనందంలో ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలకు ఓ BMW కార్ ను గిఫ్ట్ గా ఇచ్చాడు, అంతేకాదు చీఫ్ టెక్నిషియన్స్ కి గోల్డ్ కాయిన్స్ కూడా ఇచ్చాడు.
అయితే ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే.. అస్సలు వీళ్ళు జూనియర్ ఆర్టిస్టులకు, ఇతర టెక్నిషియన్స్ కి పేమెంట్లే ఇవ్వకపోవడం గమనార్హం. మేనేజర్ కు ఫోన్ చేస్తే.. అప్పుడిస్తాం, ఇప్పుడిస్తాం అంటూ కాలం వెల్లదీస్తున్నారు. తాజాగా జూనియర్ ఆర్టిస్ట్ కమ్ సింగర్ కమ్ ఏజెంట్ శ్రీను దసరా SLVC మేకర్స్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేస్తున్నాడు. జూనియర్ ఆర్టిస్టులతో పనికి ముందు ఒకలాగా, పని అయిన తర్వాత ఇంకోలా ప్రవర్తిస్తారు.
పేమెంట్లు కూడా సరిగా ఇవ్వరు అంటూ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. దసరా మూవీ కోసం గోదావరిఖనికి 23 మందిని తీసుకొచ్చాను. వారం పాటు దసరా లొకేషన్ లోనే ఉన్నాము. కానీ ఇప్పటివరకు మాకు డబ్బులు ఇవ్వలేదు. పైగా నాకు పైన 70 వేల ఖర్చు అయ్యింది. మేకర్స్ మాత్రం తనకు పేమెంట్ ఇవ్వలేదంటూ ఏజెంట్ శ్రీను దసరా మూవీ మేకర్స్ పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దసరా మూవీతో పాటు గత సంవత్సరం SLVC బ్యానర్ లో నాగశౌర్యతో మరో చిత్రాన్ని ప్రకటించారు. ఈ చిత్రానికి రంగబలి అనే టైటిల్ ని ఖరారు చేసి ఇటీవలే టీజర్ కూడా రిలీజ్ చేశారు. జూలై 7న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. అయితే మూవీ షూటింగ్ ను గతేడాది డిసెంబర్ ప్రారంభించగా.. చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులకు, ఇతర టెక్నిషియన్స్ కి ఇంకా పేమెంట్స్ క్లియర్ చేయలేదు SLVC. ఎప్పుడు పేమెంట్స్ కోసం ఫోన్ చేసినా..
ఈ వారం ఇస్తాం, ఆ వారం ఇస్తాం అంటూ నెలలు గడిపేశారు. ఇంత జరుగుతున్నా.. ఈ విషయాలన్నీ ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరికి తెలుసో.. లేదో కానీ అలాగే కొనసాగితే మాత్రం ఈ బ్యానర్ లో సినిమాలు చేయాలంటే.. ఆర్టిస్టులు ఒకటికి పదిసార్లు ఆలోచించి అవకాశం వదులుకున్నా.. ఆశ్చర్యపోనవసరం లేదు. ఇప్పటికైనా మేల్కొని SLVC ఆర్టిస్టుల సమస్యలు పరిష్కరించకపోతే.. భవిష్యత్తులో వీరితో సినిమాలు చేసేందుకు ఎవరూ ముందుకురారు. చూడాలి దీనిపై SLVC ఏ విధంగా స్పందిస్తుందో..