Whistling Village : ఈ ప్రపంచం ఎన్నో అద్భుతాల సమాహారం. వాటిల్లో భారతదేశంలోని వింతలు వర్ణనాతీతం. చాలా ప్రాంతాలు ఎన్నో ఆశ్చర్యాలతో మనల్ని అబ్బురపరిచే విధంగా ఉన్నాయి. అలాగే భారతదేశం ఎన్నో సంస్కృతులకు, సాంప్రదాయాలకు పుట్టినిల్లు. అలాంటి ఒక వింత సంస్కృతి గురించి, ఆ గ్రామం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మామూలుగా మనం ఒకరితో ఏదైనా చెప్పాలంటే ఏం చేస్తాము మాటల ద్వారా తెలియజేస్తాను కదా.. కానీ ఆ గ్రామంలో మాత్రం మాటల్లేకుండా మొత్తం విజిల్స్ ఏ.. మాటలు లేకుండా ఏ విషయం కూడా మనం ఎదుటివారికి అర్థమయ్యే రీతిగా స్పష్టం చేయలేము. కానీ ఆ గ్రామంలో ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి విజిల్స్ ద్వారానే మాట్లాడుతుంటారు. ఏది చెప్పాలన్నా కూడా విజిల్స్ ద్వారానే వాళ్ళ సంభాషణ కొనసాగిస్తూ, సంకేతాలను పంపించుకుంటారు.
ఆ గ్రామం మేఘాలయ కొండల్లో దాగివున్న కొంగ్థాంగ్ అనే గ్రామం. ఈ గ్రామానికి విజిల్ విలేజ్ అని కూడా పేరు ఉంది. ఈ గ్రామానికి ఆ పేరు ఎలా వచ్చింది అంటే..కాంగ్థాంగ్ లోని తల్లులు తమ నవజాత శిశువుల కోసం ఒక ట్యూన్ చేస్తారు. ‘జింగ్వాయి లాబీ’ అంటే మదర్స్ లవ్ సాంగ్ అనే ఈ ప్రత్యేకమైన సంప్రదాయం కారణంగా ‘విజిల్ గ్రామం’గా ఆ ఊరు ప్రసిద్ధి చెందింది. ఈ గ్రామంలోని ప్రజలు ఖాసి తెగకు చెందినవారు. వీరు మాట్లాడే భాష ఖాశీ భాష.
ఇక్కడ ప్రత్యేకమైన రాగాలతో ఒకరినొకరు పిలుచుకుంటూ ఉంటారు. తల్లి చేసిన ట్యూన్ నీ పిల్లవాడు గుర్తించడం ఇక్కడ విశేషం. మనం ఒకవేళ ఆ రోడ్ల వెంట నడుచుకుంటూ వెళ్తే మనకు ఎన్నెన్నో అరుపులు, ఈలలు ప్రత్యేకమైన రాగాలలో వినిపిస్తూ ఉంటాయి. ఆ గ్రామ జనాభా కేవలం 600 మాత్రమే కానీ, ఒక నివేదిక ప్రకారం తేలింది ఏమిటి అంటే..ఆ గ్రామంలో 600 కంటే ఎక్కువ రాగాలే విజిల్స్ రూపంలో మనకు వినిపిస్తూ ఉంటాయి.
ఇక్కడివారు ఎవరితోరైన మాట్లాడాలి అని అంటే ఈలల ద్వారానే మాట్లాడేసుకుంటారు. వారు ఏం మాట్లాడారూ అనే విషయం ఆ ఎదుటివారికి మాత్రమే అర్థమవుతుంది. అయితే అలా చెప్పే సమాచారం పక్కన ఇంకొకరికి అర్థం కాకుండా చెప్పడంలో వీళ్ళు దిట్ట. ఈ రాగాన్ని జింగర్వాయి లవ్బీ అని పిలుస్తారు. ఇంకో విషయం ఏమిటంటే ఈ గ్రామ ప్రజలు మహా సిగ్గరులు. బయట వ్యక్తులతో అంతా త్వరగా కలవరు.