Virat Kohli : ఒకటి కాదు.. రెండు కాదు.. విదేశీ గడ్డపై ఓ సెంచరీ కోసం ఏకంగా 55 నెలలపాటు సాగిన నిరీక్షణకు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తెరదించాడు. అదీ తన 500వ అంతర్జాతీయ మ్యాచ్లో ఈ ముచ్చట తీర్చుకోవడం మరో విశేషం. వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్టులో అత్యంత నిలకడను ప్రదర్శించిన విరాట్ (121) 29వ సెంచరీని సాధించాడు. తన 500వ అంతర్జాతీయ మ్యాచులో మూడంకెల స్కోరు అందుకున్నాడు. ఈ సెంచరీతో టెస్టుల్లో 29వ శతకం పూర్తి చేసుకున్న కోహ్లీ.. మొత్తంగా సెంచరీల సంఖ్యను 76కు పెంచుకున్నాడు. ఈ సెంచరీతో పలు రికార్డులను కోహ్లీ బద్దలు కొట్టాడు.

500వ అంతర్జాతీయ మ్యాచులో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్లలో టీమిండియా దిగ్గజ క్రికెటర్ వంద సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు. తర్వాతి స్థానంలో విరాట్ కోహ్లీ (76) నిలిచాడు. విరాట్ తర్వాత వరుసగా రికీ పాంటింగ్ (71), కుమార సంగక్కర (63), జాక్ కల్లిస్ (62) సెంచరీలతో ఉన్నారు. అయితే 500 అంతర్జాతీయ మ్యాచులు పూర్తయ్యే సరికి సచిన్ 75 సెంచరీలు నమోదు చేయగా.. విరాట్ కోహ్లీ ఖాతాలో 76 సెంచరీలు ఉన్నాయి.
Janhvi Kapoor : ఆ విషయంలో నాతో ఎవరు పోటీ పడలేరు..
విదేశాల్లో అత్యధిక సెంచరీలు సాధించిన భారత ఆటగాళ్లలో సచిన్ (29), తర్వాతి స్థానంలో కోహ్లీ (28) నిలిచాడు. వీదేశీ గడ్డపై ఇంకో సెంచరీ సాధిస్తే సచిన్ను సమం చేస్తాడు. ఇక అత్య ధిత శతకాలు సాధించిన టాప్ 5 బ్యాటర్లు.. సచిన్ తెందూల్క ర్ (భారత్) – 100 సెంచరీలు, విరాట్ కోహ్లీ (భారత్) – 76, రికీ పాం టింగ్ (ఆస్ట్రే లియా) – 71, కుమార సంగక్కర (శ్రీలంక) – 63, జాక్ కలీస్ (సౌతాఫ్రికా) – 62.
ఆయన అభిమానులు వీరుడా వందంనం అంటూ సెల్యూట్ చేస్తున్నారు.
Urfi Javed : పబ్లిక్ ఫిగర్ నే కానీ.. పబ్లిక్ ప్రపార్టీని కాదు..