Akhil Engagement : సినీ పరిశ్రమలో వివాహాలు, విడాకులు మామూలే. అలాగే ఎంగేజ్మెంట్ జరిగాక విడిపోయిన జంటలు కూడా ఉన్నాయి. వారి కోవలోకే చెందుతాడు అక్కినేని అఖిల్. అయితే అక్కినేని అఖిల్, శ్రీయ భూపాల్ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత విడిపోయిన జంట. ఆ తర్వాత శ్రేయ భూపాల్ ఏం చేస్తుంది? అనే విషయాలు చాలావరకు ఎవరికీ తెలియదు. జీవికే రెడ్డి మనవరాలు అయినటువంటి శ్రీయ భూపాల్, అక్కినేని అఖిల్ ప్రేమించుకున్నారు.
వీరిద్దరి నిశ్చితార్థం 2017 డిసెంబర్ లో జరగగా 2018 లో వీరి ఇద్దరి పెళ్లి ఇటలీలో ఘనంగా జరపాలని ఇటు అక్కినేని ఫ్యామిలీ, అటు జీవీకే రెడ్డి ఫ్యామిలీ వారు నిర్ణ ఇంచుకున్నారు. కానీ మధ్యలో సడన్‌గా ఏమైందో తెలియదు కానీ వీరిద్దరి ప్రేమ నిశ్చితార్థంతోనే పులిస్టాప్ పడిపోయింది. ఆ బంధం పెళ్లి వరకు వెళ్లలేదు. నిశ్చితార్థాన్ని కూడా రద్దు చేసుకున్న ఈ జంట ఆ తర్వాత అక్కినేని అఖిల్ సినిమాలు తీస్తూ ఉండగా, శ్రియా భూపాల్ మాత్రం ఏమైందన్న విషయం బయటికి రాలేదు.
అయితే ఇప్పుడు ఆమెకు సంబంధించిన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆమె న్యూయార్క్ లో ఫ్యాషన్స్ స్కూల్లో తన స్టడీస్ ని కంప్లీట్ చేసుకుంది. ఆ తర్వాత ఇండస్ట్రీకి కాస్ట్యూమ్ డిజైనర్ గా ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ లో కూడా చాలామంది స్టార్స్ అందరికీ డిజైనర్ గా పనిచేసింది. అఖిల్ తో ప్రేమ, పెళ్లి రద్దయిపోయిన తర్వాత కొన్నాళ్లు ఒంటరిగానే ఉంది శ్రియ.
తర్వాత 2018లో అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ ప్రతాప్ శ్రీ రెడ్డి మనవడు చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి పెద్ద కుమారుడైనటువంటి అనిందిత్ రెడ్డితో పెళ్లి పీటలు ఎక్కింది శ్రీయ. అతను ఉపాసన కామినేని కి తమ్ముడు కావడం గమనార్హం. అనిందిత్ రెడ్డి, శ్రియ పెళ్లిని ఇరువురి కుటుంబ సభ్యులు చాలా ఘనంగా నిర్వహించారు. ఆ తర్వాత వీరిద్దరూ ఫారెన్ వెళ్లిపోయినట్లు సమాచారం. ఆ తర్వాత శ్రియా మగ బిడ్డకి కూడా జన్మనిచ్చారు అని తెలుస్తుంది.
ప్రస్తుతం శ్రీయా ఒకవైపు ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూనే మరోవైపు తన వృత్తిని కూడా కొనసాగిస్తూ హ్యాపీగా గడుపుతున్నారు. ఇది ఇలా ఉండగా అఖిల్‌తో విడిపోవడానికి అసలు కారణం అఖిల్ చాలా మందితో ఎఫైర్స్ పెట్టుకోవడమే అని ఒక బొగట్ట లేచింది. దాని కారణంగానే శ్రియ, అఖిల్ ని దూరం పెట్టి పెళ్లి క్యాన్సిల్ చేసుకుందనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది.