Allu Arjun – Venu Swamy : వేణు స్వామి ఈ పేరు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న వ్యక్తి. ఇతను ఆస్ట్రాలజర్ గా చాలా ఫేమస్ అయిపోయాడు. ముఖ్యంగా సినీ హీరో, హీరోయిన్ల జాతకాలు చెబుతూ, ఎప్పుడు వార్తలలో నిలుస్తూ ఉంటాడు. ఇతను జాతీయ అవార్డు గెలుచుకున్న అల్లు అర్జున్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
గతంలో వేణు స్వామి చెప్పిన విషయాలు నిజమయ్యాయి. దానికి ఉదాహరణ సమంత, నాగచైతన్య విడాకులు. ఆ తర్వాత కొంతమంది హీరోయిన్ల జాతకంలో దోషాలు ఉన్నాయని కూడా వారితో యాగాలు, పూజలు చేయించారు వేణు స్వామి. రష్మిక, పూజా హెగ్డేలాంటి హీరోయిన్లు కూడా వేణు స్వామి దగ్గర పూజలు చేయించుకున్న జాబితాలోకి వచ్చారు. ఈ మధ్యకాలంలో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన డింపుల్ హయాతి కూడా వేణు స్వామి దగ్గర పూజలు చేయించుకుంది.
అయితే ఇప్పుడు అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిన విషయమే.. ఈ విషయం గురించి సంవత్సరం క్రితమే వేణు స్వామి కామెంట్స్ చేశారు. ఇప్పుడు తను మాట్లాడిన మాటలన్నీ నిజమయ్యాయి అని చెప్పి, బన్నీ ఫ్యాన్స్ వేణు స్వామి వీడియోని వైరల్ చేస్తున్నారు. ఇంతకీ అల్లు అర్జున్ గురించి వేణు స్వామి చేసిన కామెంట్స్ ఏంటి..
సరిగ్గా సంవత్సరం క్రితం వేణు స్వామి అల్లు అర్జున్ గురించి రాబోయే కాలంలో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా ఎదుగుతాడు. నెంబర్ వన్ పొజిషన్ లో ఉంటాడు అని చెప్పాడు. అలాగే ఒక్కో సినిమాకు 100 కోట్లు తీసుకుంటాడు. కళ్ళు మూసుకుంటే 300 కోట్లు ఆయన సినిమాకు వచ్చేస్తాయి, బన్నీకి తిరుగులేదు. నిర్మాతలు అతనితో సినిమా తీయడానికి ఎటువంటి సంకోచం పడవలసిన అవసరం లేదు. పది సంవత్సరాల వరకు బన్నీని ఎవరు కూడా ఎదుర్కోలేరు అని చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు వేణు స్వామి.
సరిగ్గా ఇప్పుడు బన్నీ విషయంలో వేణు స్వామి చేసిన కామెంట్స్ నిజమయ్యాయి. బన్నీకి సినీ తెలుగు సినీ పరిశ్రమలోనే ఎవరికి దక్కని సువర్ణ అవకాశం దక్కింది. జాతీయ అవార్డును తన కైవసం చేసుకున్నాడు. బన్నీ విషయంలో వేణు స్వామి చెప్పిన విషయాలు నిజమయ్యాయి అని అప్పటి వీడియోను వైరల్ చేసేస్తున్నారు.