Amitabh Bachchan Anushka Sharma : ట్రాఫిక్ నిబంధనలను అనుసరించడం మరియు రోడ్లపై రూల్స్ పాటించండి అని పోలీస్ డిపార్ట్మెంట్ పదే పదే ప్రచారం చేస్తున్నప్పటికీ, ఇది పౌరులకే కాదు, సెలబ్రెటీలకు కూడా వర్తిస్తుంది. ఇటీవల ముంబై ట్రాఫిక్ లో చిక్కుకున్న అమితాబచ్చన్ కి బైక్ మీద వెళ్లే ఓ సాధారణ వ్యక్తి సహాయం చేశారు. ‘నన్ను బైక్ మీద తీసుకెళ్లినందుకు చాలా థాంక్స్.. నన్ను తీసుకెళ్లిన వ్యక్తి ఎవరో తెలియదు, కానీ బైక్ పై నన్ను వేగంగా తీసుకెళ్లడంతో సరైన సమయానికి షూటింగ్ కి చేరుకున్నానంటూ ఆయన పోస్టులో తెలిపారు.
అనుష్క శర్మ కూడా కారును పక్కనపెట్టి తన బాడీ గార్డ్ బైక్‌పై ముంబై వీధుల్లో మే 15న చక్కర్లు కొడుతూ కనిపించింది. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్ అయింది. ఈ వీడియోలో అనుష్కతో పాటు ఆమె బాడీగార్డ్ కూడా హెల్మెట్ ధరించలేదు. ఈ సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే సరికి.. వీరిద్దరి ఫోటోలను షేర్ చేస్తూ.. ఇద్దరికీ బైక్ పై వెళ్తూ హెల్మెట్స్ లేవని.. సెలబ్రెటీలు అయితే రూల్స్ బ్రేక్ చెయ్యొచ్చా అంటూ పలువురు ముంబై పోలీసులను ట్యాగ్ చేశారు.
దీంతో పోలీసులు వెంటనే స్పందించి వారిద్దరిపై కేసులు నమోదు చేశారు. దీంతో ముంబై పోలీసు ఆ ట్వీట్‌ని రీ ట్వీట్ చేస్తూ బైక్‌పై ఉన్న ఇరువురు రైడర్లు హెల్మట్ ధరించలేదని పేర్కొంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఇరువురిపై చర్యలు తీసుకుంటామని, వీరిద్దరి గురించి ట్రాఫిక్ బ్రాంచ్ కు షేర్ చేశామంటూ ట్వీట్ చేశారు. బహుళా హెల్మెట్ ధరించనందుకు వీరిద్దరికి ఫైన్ వేసినట్లుగా తెలుస్తోంది. ట్రాఫిక్ నుంచి తప్పించికునేందు అమితాబ్, అనుష్క చేసిన పనులు వారిని మరింత చిక్కుల్లో పడేశాయి.
@MumbaiPolice No helmet?
— 𝑺𝒐𝒉𝒂𝒊𝒍𝒇𝒂𝒂𝒓𝒛𝒆𝒏𝒊 (@Chalbaechal) May 15, 2023