Brahmaji Funny Tweet On NBK 108 : టాలీవుడ్ లో నటుడు బ్రహ్మాజీ (Brahmaji) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన నటనతో, చలాకీతనంతో కామెడీతో కౌంటర్లు వేస్తూ.. అందర్నీ నవ్విస్తూ ఉంటాడు. స్టేజి మీద అయినా సోషల్ మీడియాలో అయినా సరే ఆయన వేసే కౌంటర్లు మాములుగా ఉండవు. ఇక తాజాగా బాలయ్య 108 షూటింగ్ లో జాయిన్ అయిన బ్రహ్మాజీ ఓ ఫన్నీ ట్వీట్ చేశాడు. బ్రహ్మాజీ పోస్ట్ లో డైరెక్టర్ గారు మేము కూడా ఆన్ బోర్డే మాకు లేదా వెల్కమ్ అంటూ..
సరే నా పాన్ ఇండియా ఫ్యాన్స్ కి నేనే గ్లింప్స్ వదులుతా అంటూ ఓ ఫన్నీ వీడియోను డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi)తో ప్లాన్ చేశాడు. ఆ వీడియోని ట్విట్టర్ లో పోస్ట్ చేయగా అది కాస్తా వైరల్ అయ్యింది. దానికి అనిల్ రావిపూడి రిప్లై ఇస్తూ “ఏ స్క్రిప్ట్ అయినా ఆఫీస్ బోర్డు మీద ఉన్నపుడే మీరు ఆల్రెడీ ఆ స్క్రిప్ట్ లో వుంటారు.. మళ్ళీ మీకు సెపరేట్ గా ఆన్ బోర్డ్ లు అవసరమా బ్రహ్మాజీ గారు” అంటూ నవ్వుతూ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం వీరి పోస్ట్ లో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇటీవల బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి అభిమానులను జోష్ లో ఉంచారు. ఇదే జోష్ లో NBK 108 సినిమాను శరవేగంగా చేస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) హీరోయిన్ గా, శ్రీలీల(Sreeleela) బాలయ్య కూతురి పాత్రలో NBK 108 సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ ని బాలయ్య బాబుకి విలన్ గా తీసుకొచ్చారు. దసరా కానుకగా వస్తున్న ఈ మూవీతో బాలయ్య హ్యాట్రిక్ హిట్ కొడతాడేమో చూడాలి.
ఏ స్క్రిప్ట్ అయినా ఆఫీస్ బోర్డు మీద ఉన్నపుడే మీరు ఆల్రెడీ ఆ స్క్రిప్ట్ లో వుంటారు…. మళ్ళీ మీకు సెపరేట్ గా ON BOARD లు అవసరమా బ్రహ్మాజీ గారు….🤣🙏….. https://t.co/2PuSJofRVo
— Anil Ravipudi (@AnilRavipudi) May 10, 2023