Chandrayaan : భారతదేశం ప్రపంచ దేశాలు గర్వించే విధంగా చరిత్రలో నిలిచిపోయింది. చంద్రుడిపై కాలు మోపిన నాలుగో దేశంగా భారత్ నిలవడం దేశానికి గర్వకారణం. సరిగ్గా బుధవారం సాయంత్రం గం 6:05 నిమిషాలకు చంద్రుడిపై అడుగు పెట్టింది. విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్ జరిగిన మూడు గంటల తర్వాత విక్రమ్ ల్యాండర్ లోని ప్రగ్యాన్ రోవర్ బయటకు వచ్చింది. చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ 14 రోజులపాటు చాలా కీలకమైన పరిశోధనలు చేయడం ఈ ప్రక్రియ యొక్క ముఖ్య ఉద్దేశం.
అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం చంద్రుడు మనకు ఒకవైపే కనిపిస్తాడు. ఈ విషయం చాలామందికి తెలియదు. కానీ ఇది వాస్తవం. మరి అలా ఒక వైపే కనిపించడానికి కారణాలు ఏమిటి? చంద్రుడు కూడా భూమి లాగే ఒక గ్రహం. మరి అలాంటప్పుడు చంద్రుడు ఒకవైపే ఎందుకు కనిపిస్తాడు అనేది ఇక్కడ ప్రశ్న. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాడని శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో చెబుతున్న మాట.
ఇక్కడే మనకు ఒక డౌట్ వస్తుంది. తన చుట్టూ తాను తిరిగినప్పుడు పూర్తి భాగం మనకు కనిపించాలి. అయితే భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది. కానీ చంద్రుడు అలా కాదు, భూమి చుట్టూ తిరుగుతూనే తన చుట్టూ తాను తిరుగుతాడు. అయితే భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటల సమయం పడుతుంది. అలాగే చంద్రుడు తన చుట్టూ తన తిరిగి రావడానికి దాదాపు ఇరవైతొమ్మిదిన్నర రోజులు పడుతుంది.
అంటే చంద్రుడి మీద ఒకరోజు అంటే భూమి మీద 29 రోజులని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. చంద్ర బ్రమణ కాలం, చంద్ర పరిభ్రమణ కాలం రెండు కాలాలు సమానం. దాని కారణంగా చంద్రుడు మనకు ఒకవైపు మాత్రమే కనిపిస్తాడు. చంద్రుడు, భూమికి ఒక ఉపగ్రహం. భూమి చుట్టూ పరిభ్రమిస్తూ ఉన్నాడు. అందుకే చంద్రుడు మనకు ఒకవైపు మాత్రమే కనిపిస్తాడు.