Chicago : జనాభాపరంగా అమెరికాలో మూడో అతిపెద్ద నగరమైన చికాగో నగరం క్రుంగుతుందనే వార్తలు ఇప్పుడు హల్ చల్ చేస్తున్నాయి. తాజా అధ్యయనాలు కూడా ఈ విషయాన్నే దృవీకరిస్తున్నాయి. చికాగో ఇలా కావడానికి కారణం ముఖ్యంగా భూగర్భ పర్యావరణ మార్పులు అని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు ఈ పరిణామాన్ని ‘సబ్‌సర్ఫేస్ హీట్ ఐలాండ్స్’ అని అంటారు. భూగర్భం ఎలా కారణమవుతుందంటే..
ముఖ్యంగా భవనాల నుంచి వెలువడే వేడి, సబ్ వే వంటి భూగర్భ రవాణా వ్యవస్థల కారణంగా ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కాలక్రమేన నగరంలో జనాభా సంఖ్య పెరిగిపోతుంది. నగరం అంతా జనాలతో కిక్కిరిసిపోతుంది. ముఖ్యంగా భారీ భవంతులు నిర్మించడం, పట్టణాల్లో భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు భూమిలో మార్పులకు కారణమవుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇన్‌ఫ్రాస్ర్టక్చర్‌పై ఈ విధానం ప్రభావం చూపుతుందని ఇల్లినాయిస్లోని నార్త్‌వెస్ట్రన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు అలెగ్జాండ్రో రోటా లోరియా వివరించారు. పరిశోధకుల పరిశోధన ఎలా సాగిందంటే వారు భూమి పైన భూగర్భంలోనూ 150 టెంపరేచర్ సెన్సార్లను అమర్చి.. బేస్మెంట్స్, పార్కింగ్, గ్యారేజ్, టన్నుల్స్ వంటి రకరకాల ప్రదేశాలలో వాటిని అమర్చారు.
నిర్మాణాలు, రవాణా కారణంగా అధిక వేడి ఎలా వెలువడుతుందో, అలాగే ఎలాంటి నిర్మాణం లేనటువంటి గ్రాండ్ పార్క్ ప్రాంతాలలోనూ ఈ సెన్సార్లను అమర్చి రెండిటి మధ్య వ్యత్యాసాన్ని గమనించారు. ఇలా మూడేళ్ల పాటు డేటాను సేకరించిన తర్వాత గ్రాండ్ పార్క్ కంటే లూప్ జిల్లా అండర్ గ్రౌండ్ టెంపరేచర్ 10 డిగ్రీలు అధికంగా ఉన్నట్టు వాళ్ళు తెలిపారు. భూగర్భంలో మార్పులకు ఇది కారణమవుతుందని పరిశోధకులు వెల్లడించారు.
అయితే జనాభాపరంగా అతిపెద్ద నగరమైన న్యూయార్క్ కూడా క్రుంగుతుందని పరిశోధకులు ఇంకో ఆశ్చర్యకరమైన విషయాన్ని తెలిపారు. 20 సంవత్సరాల పాటు అధ్యయనం చేసి వారు ఈ నిర్ధారణకు వచ్చినట్టు తెలిపారు. భూగర్భ పర్యావరణ మార్పులు, జలాల కలుషితం దీనికి కారణమై ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు.