Crocodile : మొసళ్ళు ఆరెంజ్ కలర్ లో ఉండడం మీరు ఎప్పుడైనా చూసారా ? నేపాల్ లో హిమాలయాల్లో ఉన్న రక్షిత ప్రాంతమైనటువంటి చిత్వాన్ నేషనల్ పార్క్ లో ఆరెంజ్ రంగులో మొసళ్ళు దర్శనమిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. మే 29న లీబ్నిజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్‌వాటర్ ఎకాలజీ అండ్ ఇన్‌ల్యాండ్ ఫిషరీస్ పరిశోధకురాలు ఫోబ్ గ్రిఫిత్ ఈ మొసళ్ల ఫస్ట్ ఫోటో షేర్ చేశారు.
పరిశోధకులు మొసళ్ళు ఆరెంజ్ కలర్ కి మారడంపై చాలా సందేహాలను వ్యక్తం చేశారు. ఈ నారింజరంగు ఎలిగేటర్లు, మొసలి ఫోటోలు ఇప్పుడు చాలా వైరల్ అవుతున్నాయి. అసలు మొసళ్ళు కు ఈ వింత రంగు రావడానికి కారణమేమిటో తెలుసుకోవాలని చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే మనకు తెలిసినంతవరకు మొసళ్ళు నలుపు, గోధుమ రంగులో లేదా తెలుపు రంగులో ఉంటాయి. కానీ ఇక్కడ వింత ఏమిటంటే ఆరెంజ్ కలర్ లోకి మారి అందరి నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. పరిశోధకుల బృందం మొసళ్ళు రంగు మారడానికి కారణం తెలుసుకోవాలని, ప్రాజెక్టు మెసిస్టాప్స్ సహాయం తీసుకుంది. పశ్చిమ ఆఫ్రికా అంతటా ఐవరీ కోస్ట్ లో అంతరించిపోతున్న స్లెండర్-స్నౌటెడ్ మొసలిని
సంరక్షించడానికి తిరిగివాటి వృద్ధి పెంచడానికి ప్రాజెక్టు పనిచేస్తుంది. మొసళ్ళు నారింజ రంగంలోకి మారడానికి ప్రధాన కారణం, చిత్ర నేషనల్ పార్క్ లోని నదులు, నీటి ప్రవాహాలలో ఇనుము ఎక్కువగా ఉండటమే కారణం అని పరిశోధకులు చెబుతున్నారు. ఈ కారణంగానే వాటి శరీరం మొత్తం రంగు మారుతుంది అని వాళ్ళు వెల్లడించారు.
అలాంటి నీటి ప్రవాహాల దగ్గర ఎక్కువ సమయం ఉండటంవల్ల, ఆ నీటిని తాగే ఎలిగేటర్లు, మొసళ్లు రంగు నారింజ రంగులోకి మారుతున్నాయని ఫోబ్ గ్రిఫిత్ వివరించారు. చిత్వాన్‌లోని కొన్ని ప్రాంతాల్లోని నీటిలో ఐరన్ అధిక స్థాయిలో ఉందని, ఇనుము ఆక్సిజన్‌తో చర్య జరిపి ఐరన్ ఆక్సైడ్ అనే నారింజ పదార్థాన్ని ఏర్పరుస్తుందని పరిశోధకులు కనుగొన్నారు.