Devisri Prasad : దేవిశ్రీప్రసాద్ ఈ పేరు వినగానే మనకు ఆ మ్యూజిక్ తో ఒకలాంటి ఊపు వచ్చేస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడంటే ఆ పాటలు ఏ రేంజ్ లో ఉంటాయో మనం గెస్ చేయొచ్చు. ప్రేక్షకున్ని కూర్చున్న చోటు నుంచి లేచి నిల్చుని డాన్స్ వేసే లాగా చేస్తాయి దేవిశ్రీప్రసాద్ పాటలు. ఏ పాటలకైనా సరే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించడంలో ఆయనది అందవేసిన చేయి.
ప్రేక్షకుల నాడి పట్టుకుని వారికి ఎటువంటి పాట అయితే ఇష్టమో ఇట్టే పసిగట్టి ఆ రకమైన పాటను ఆ సినిమా స్టోరీకి తగ్గట్టు అందించగల సత్తా దేవి శ్రీ ప్రసాద్ కి మాత్రమే ఉంటుంది. అయితే పుష్ప సినిమా గురించి దేవిశ్రీ కొన్ని కామెంట్స్ చేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో పుష్ప సినిమా ఎంత బిగ్గెస్ట్ హిట్ అనేది మనం ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. పుష్ప సినిమా సీక్వెన్స్ కూడా ప్లాన్ చేసారు. ఆ చిత్రం యూనిట్ ప్రస్తుతం ఆ షూటింగ్ లో అందరూ బిజీ బిజీగా ఉన్నారు.
పుష్ప సినిమాకు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ ఎంత ప్లస్ పాయింట్ అనేది మనకు తెలుసు. పాటలు బిగ్గెస్ట్ హిట్టును అందుకున్నాయి. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ కెరియర్ లో పుష్ప సినిమా పాటలకు గాను ఆయన నేషనల్ అవార్డును కూడా గెలుచుకున్నారు. ఇప్పుడు అదే జోష్ లో ఆయన పుష్ప సీక్వెన్స్ కు కూడా మ్యూజిక్ ని అందిస్తున్నారు. అయితే పుష్ప సినిమా కూడా ఆస్కార్ అవార్డు గెలుచుకునే సత్తా ఉన్న సినిమా అంటూ ఆయన కామెంట్ చేశారు.
నిర్మాతలు ఈ సినిమాను ఆస్కార్ నామినేషన్స్ కి ఎందుకు పంపలేదు అనేది ఇప్పటికీ అర్థం కాలేదని, పంపితే మాత్రం ఖచ్చితంగా సినిమాకి ఆస్కార్ వచ్చేదని ఆయన కామెంట్ చేశారు. అలాగే సినిమాలో నాటు ,నాటు పాటగాను ఆస్కార్ రావడం నిజంగా తనకు చాలా ఆనందంగా ఉందని కూడా తెలియజేశారు. ప్రస్తుతం దేవిశ్రీ ప్రసాద్ పుష్ప సినిమా గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.