Dhruv Vikram : తమిళ్ హీరోలు తెలుగులో కూడా సినిమాలు చేస్తూ ఉంటారు. మంచి గుర్తింపు తెలుగు ఇండస్ట్రీలో తెచ్చుకోవాలని కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. అయితే ఇప్పుడు ఆ ప్రయత్నాల్లోనే ఉన్నాడు తమిళ హీరో విక్రమ్. విక్రమ్ తెలుగు సినిమాకు సుపరిచితుడు ఆయన తన కొడుకును కూడా తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టించాలని శరవేగంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు వినికిడి. అయితే ఇప్పటికే విక్రమ్ కొడుకు అర్జున్ రెడ్డి సినిమాను తమిళంలో రీమేక్ చేసి మంచి హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇప్పుడు అదే జోష్ తో తెలుగులోకి ధృవ్ నీ తీసుకువచ్చే పనిలో విక్రమ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే సినిమా కథ వినడము డైరెక్టర్ నీ కూడా ఫైనల్ చేసేయడం లాంటి పనులు కూడా జరిగిపోయాయని సమాచారం. ఇది ఇలా ఉంటే గతంలో విక్రమ్ తెలుగులో చాలా సినిమాలే చేశాడు. కానీ ఆయనకు ఇక్కడ సరైన గుర్తింపు రాలేదు. తర్వాత తను తమిళ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి మంచి హిట్ల ను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఆ తర్వాత శంకర్ దర్శకత్వంలో వచ్చిన అపరిచితుడుతో భారీ బ్లాక్ బస్టర్ హీట్ ని సొంతం చేసుకోవడమే కాక.. తెలుగులో మంచి గుర్తింపును కూడా పొందాడు. తన కొడుకును కూడా ఎలాగైనా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి హీరోగా నిలబెట్టాలని తాపాత్రయంతో ఉన్నాడు విక్రమ్. అపరిచితుడు తర్వాత సరైన హిట్టు తెలుగులో విక్రమ్ కి లేదు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు తన కొడుకును తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి తీసుకు వస్తున్నాడు విక్రమ్.. మరి తను ఎంతలా రాణిస్తాడో వేచి చూడాల్సిందే.