Divorce Photo shoot:పెళ్లిళ్లకు,పుట్టినరోజులకు, లేకపోతే ఇంకా ఏదైనా ఫంక్షన్స్ జరిగితే ఫోటోలు, ఫోటోషూట్స్ చేస్తూ ఉంటాం. కానీ ఇప్పుడిప్పుడే కొత్త కల్చర్ బయటికి వస్తుంది. విడాకులకు కూడా ఫోటో షూట్ చేసే ఆచారం కొత్తగా కనిపెట్టారు.ఇది వినడానికి కాస్త షాకింగ్ గా ఉన్నా కూడా ఇది ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న విషయము.
ఇంకా ఇది ఇండియా వరకు రాకపోయినా కూడా విదేశాల్లో మాత్రం ఈ కల్చర్ స్టార్ట్ అయిపోయింది. ఇండియాకి పాకడానికి ఇంకా ఎంతో సమయం పట్టదు లేండి.. ఇప్పటికే ఇండియాలో కూడా కాస్త మనస్పర్థలు వచ్చినా వెంటనే విడాకుల వరకు వెళ్లిపోతున్నాయి కొన్ని జంటలు. ఇంకా కొద్ది కాలం పోతే ఈ విడాకుల ఫోటోషూట్ ని కూడా ఫాలో అయిపోతారూ అందులో సందేహమే లేదని చెప్పొచ్చు. అసలు విషయంలోకి వెళ్తే
ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్స్ , బేబీ బంప్స్ ఫొటో షూట్స్ ట్రెండింగ్ లో ఉండగా.. కొన్ని ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయితే వింతగా చిరాకు తెప్పించేలా ఉన్నాయి. ఇక ఇప్పుడు ఆ ట్రెండ్ డివోర్స్ వరకూ వచ్చింది. ఇప్పుడు విడాకులు తీసుకున్నా.. అది ఓ సెలబ్రేషన్ లాగా ఫొటో షూట్ చేస్తున్నారు.
పెళ్లి కార్డు, పెళ్లి బట్టలు తగలబెడుతున్నారు. విదేశాల్లో ఈ ట్రెండ్ మెుదలైంది. ఇది ఎలా అంటే.. ఎంత సంతోషంగా పెళ్లి చేసుకొని ఒక్కటవుతారో.. అంతే ఆనందంగా.. విడిపోవాలన్న మాట. ఓ అమ్మాయి ఇలానే.. విడాకుల ఫొటో షూట్ చేసి ట్రెండ్ అయిపోయింది. “లారెన్ బ్రూక్” అనే ఆమె చాలా చక్కగా రెడీ అయి ఫొటోలకు పోజులు ఇస్తూ..
ఆమె పెళ్లినాటి పెళ్లి దుస్తులను, పెళ్లి ఫోటోలు అన్నింటిని కాల్చి బూడిద చేసింది. ఆమె విడాకులు తీసుకున్నట్టు తెలిసేలాగా ఆమె ఒక బోర్డును కూడా పట్టుకొని ఫొటోస్ కి ఫోజులిచ్చింది. పెళ్లిరోజు తల మీద వేసుకునే కొంగును, పెళ్లి ఫోటోల ఫ్రేమ్ ను కూడా తగలబెట్టేసింది. ఆ వీడియో క్లిప్స్ ,ఫొటోస్ అన్నిటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడా వీడియో క్లిప్స్ వైరల్ అవుతున్నాయి.
ఆమె విడాకుల బాధని మర్చిపోవడానికే..అలా చేసిందని కొందరు సపోర్ట్ చేస్తుండగా.. మరికొందరు ఇదేం మాయరోగం అని కామెంట్ చేస్తున్నారు.