Heroine Vaishnavi Chaitanya : కొందరికి అదృష్టం ఎప్పుడు ఏ విధంగా తలుపుతడుతుందో తెలియదు. అదృష్టం వచ్చినప్పుడే అందిపుచ్చుకున్న వాళ్ళు జీవితంలో సక్సెస్ అవుతారు. ఇప్పుడు అచ్చం మన బేబీ సినిమాలో హీరోయిన్ గా నటించిన వైష్ణవి చైతన్య ఆ కోవాలోకె చెందుతుంది. ఎందుకంటే అమ్మడికి బేబీ సినిమా సక్సెస్ తర్వాత ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా ఫ్యాన్ ఇండియా సినిమాలోని చాన్స్ కొట్టేసింది అనే వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
సినీ ఇండస్ట్రీలో వారసత్వపు పోకడ కొనసాగుతున్న సమయంలో వైష్ణవి ఎటువంటి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ లేకుండా ఒంటరిగా బరిలోకి దిగి, ఈరోజు మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. బ్లాక్ బస్టర్ సినిమాను తన ఖాతాలో వేసుకుంది. ఇంతకుముందు యూట్యూబర్ గా ఉన్నటువంటి వైష్ణవి కొన్ని వెబ్ సిరీస్ కి కవర్ సాంగ్స్ చేస్తూ..
అలాగే కొన్ని సినిమాలలో చిన్న, చిన్న పాత్రలు చేసింది. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి బేబీ సినిమాతో అడుగుపెట్టి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఆ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. వైష్ణవి ఇప్పటికి కూడా చాలామంది కుర్రకారు వైష్ణవి నటనను మర్చిపోలేకపోతున్నారు అంటే తను ఏ రేంజ్ లో సినిమాను ఒన్ చేసుకొని నటించిందో చెప్పాల్సిన అవసరం లేదు. అల్లు అరవింద్ కొడుకు అల్లు శిరీష్ తో ఒక సినిమాకి బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య కమిటీ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి.
అలాగే రామ్ పోతినేని నటిస్తున్న డబ్బులు ఇస్మార్ట్ లోను సెకండ్ హీరోయిన్ ఛాన్స్ కొట్టేసినందుకు తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా తాజాగా ఓ పాన్ ఇండియా సినిమాలో సెకండ్ హీరోయిన్ గా సెలెక్ట్ అయినట్లు కూడా సోషల్ మీడియాలో వార్త చెక్కర్లు కొడుతుంది. వైష్ణవి చైతన్య తెలుగు అమ్మాయి కావడంతో తనను ఎంకరేజ్ చేయడం కోసం ఒక స్టార్, హీరో ఈ డెసిషన్ తీసుకున్నారని తన సినిమాలో ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ వార్తలు ఎంతవరకు నిజమనేది బయటికి రావాల్సి ఉంది.