iBOMMA : ఈ ఐబొమ్మ సామాన్యులకు అతి దగ్గరగా చేరువైంది. దీంట్లో నేరుగా వీడియోలు చూసుకోవచ్చు లేదా డౌన్లోడ్ చేసుకునే సౌలభ్యం కూడా ఉంటుంది. అసలు ఈ ఐబొమ్మలో సినిమాలు ఎవరు పెడతారు.? దీన్ని ఎవరు నడిపిస్తారు.? అది నడవడానికి డబ్బులు ఎలా వస్తాయి. ? అని ఆలోచన మీకు ఎప్పుడైనా కలిగిందా? అలా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చూడడం చట్టరీత్యా నేరం అంటారు. మరి అలాంటప్పుడు ఈ ఐబొమ్మను ఎవరు నడుపుతున్నారు. అనే సందేహాలు రావచ్చు. కానీ ఇప్పటివరకు ఈ సందేహాన్ని ఎవరు నివృత్తి చేయలేకపోయారు.
ఐబొమ్మ అనేది సైబర్ నేరగాల్లకు మంచి అడ్డా.. అని చెప్పవచ్చు. వారు సామాన్యులకు వేసే వల అని కూడా మనం అనుకోవచ్చు. మనం సినిమాలు చూస్తున్నప్పుడు ఒక్కోసారి వైరస్ డౌన్లోడ్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. దానివల్ల చాలా ప్రమాదాలు రావచ్చు. అయినా కూడా జనాలు మాత్రం ఈ ఐబొమ్మలో సినిమాలు చూడడం ఆపడం లేదు. థియేటర్ ప్రింట్ లో ఫుల్ మూవీ వెంటనే ఐబొమ్మలో వస్తుంటే చూడకుండా ఎలా ఉండగలుగుతారు.
అయితే ఈ ఐబొమ్మ వల్ల ప్రేక్షకులకు ఫ్రీగా సినిమాలు లభిస్తున్నాయి కానీ, సినిమాలు తీసే నిర్మాతలు మాత్రం నష్టాన్ని చవి చూడవలసి ఉంటుంది. ఇండస్ట్రీలో ఈ ఐబొమ్మ వల్ల చాలామంది కష్టాలు పడుతున్నారు. దానికి కారణం థియేటర్ కి వెళ్లేవారి సంఖ్య తగ్గడమే. ఈ ఐబోమ్మ నడిపేవారు ఈ వెబ్సైట్ ను ఏ దేశంలో ఉండి నడుపుతున్నారో కూడా ఎవరు పసిగట్టలేక పోవడం గమనార్హం. ఒక వెబ్సైట్ డోమెన్ అడ్రస్ ను బ్లాక్ చేస్తే వారు వెంటనే ఇంకో డొమైన్ తో సినిమాలను అప్లోడ్ చేస్తున్నారు.
ఎన్ని డొమైన్ లను బ్లాక్ చేసిన కూడా వారు వెంటనే మార్చేస్తున్నారు. దానివల్ల వాళ్లను పట్టుకోవడం కష్టతరంగా మారింది. దీనివల్ల వారికి ఏంటి లాభం అని విచారిస్తే.. ఐబొమ్మలో సినిమాలు చూసే మధ్యలో యాడ్స్ వస్తూ ఉంటాయి. ఈ యాడ్స్ ని చూసినప్పుడు వాళ్లకి ఆటోమేటిక్ గా డబ్బులు వస్తాయి. ఇప్పుడు దేశంలో చాలా లక్షల మంది ఐబోమ్మను వీక్షిస్తున్నారు. ఇలా లక్షల్లో జనాలు చూసినప్పుడు వారి ఆదాయం కూడా ఎక్కువగానే ఉంటుంది. వీరు సినిమాల మధ్యలో యాడ్స్ ని పెట్టి డబ్బులు సంపాదిస్తున్నారు.
అయితే వీరు ముందుగానే కొన్ని బ్రాండ్స్ తో ఒప్పందాన్ని చేసేసుకుంటారు. వాటి ద్వారా కూడా డబ్బులు వీళ్లకు లభిస్తాయి. అలా కొత్త సినిమాలను పైరసీ చేసి అందులో పెట్టి ఎక్కడో విదేశాల్లో ఉంటూ వీరు డబ్బులు సంపాదించడం, జనాలు ఐ బొమ్మలో సినిమాను ఉచితంగా చూడొచ్చు అని భ్రమలో ఉంటారు. థియేటర్లకు వెళ్ళనవసరం లేదు. పైసలు వెచ్చించాల్సిన అవసరం లేదని అనుకుంటారు. కానీ దీనివల్ల దర్శక, నిర్మాతలు నష్టాన్ని పొందుతున్నారు. అందుకే మనం చట్టాల ప్రకారం చూసుకుంటే ఐ బొమ్మలో సినిమాలో చూడడం అనేది ఇల్లీగల్ కిందికే వర్తిస్తుంది.