Kerala : బ్రహ్మంగారు చెప్పినట్టు భూమి మీద అప్పుడప్పుడు కొన్ని వింతలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఏదైనా వింత జరిగితే నిమిషాలలో ఆ వార్త అంతటా వ్యాపించి అందరికీ తెలిసిపోతుంది. అదంతా మన చేతుల్లో ఉన్న ఫోన్ మహిమ. కేరళ రాష్ట్రంలో ఓ వింత సంఘటన వెలుగులోకి వచ్చింది.
ఒక్కోసారి భూమి నుంచి వింత శబ్దాలు వస్తూ ఉంటాయి. అయితే అవి భూకంపానికి సంకేతాలుగా కొందరు భావిస్తూ ఉంటారు. అలా వచ్చినప్పుడు భూకంపం వస్తుందేమో అని భయపడిపోతూ ఉంటారు. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ఆ ఊరి ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
కేరళ రాష్ట్రంలోని కొట్టాయం జిల్లా చిన్నపాడి గ్రామంలో ఈ వింత సంఘటన జరిగింది. భూమి నుండి వింత, వింత శబ్దాలు వస్తున్నాయి. అక్కడి ప్రజలందరూ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని రోజులు గడుపుతున్నారు. ఈ వారం నుండి చిన్నపాడితోపాటు చుట్టుపక్కల ఊర్లో కూడా అచ్చం ఇలాంటి శబ్దంతో కూడిన సంఘటనలే వెలుగులోకి వస్తున్నాయి. అకస్మాత్తుగా ఓ రోజు
ఉదయం రెండు భారీ శబ్దాలు వినిపించాయని స్థానికులు భయంగా చెబుతున్నారు. ఈ వింత సంఘటనకు సంభందించి అసలు కారణాలు బయట పెట్టడం కొరకు త్వరలో సెంటర్ ఫర్ ఎర్త్ సైన్సెస్ బృందం ఆ ప్రాంతానికి చేరుకుని, వింత శబ్దాల వెనుక దాగివున్న మిస్టరీ పై స్పష్టత ఇస్తుందని అధికారులు చెబుతున్నారు.