Liger Exhibitors Relay : టాలీవుడ్ లో డేరింగ్ అండ్ డాషింగ్,మాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు పూరీ జగన్నాథ్. పూరీ. ఎలాంటి హీరో అయినా పూరీ చేతిలో పడితే ఆటం బాంబ్ లా మారిపోతాడు. పూరీ సినిమాలో హీరో చెప్పే ఒక్కో డైలాగ్ ను యూత్ అంతా ఓన్ చేసుకొని మన గురించే రాసాడురా అని ఫీల్ అవుతారు. అయితే గత కొంతకాలంగా పూరి సైలెంట్ అయిపోయాడు. దీనికి కారణం లేకపోలేదు.. మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం లైగర్.
ఎన్నో అంచనాల మధ్య గత సంవత్సరం ఆగస్ట్ 25న విడుదలై ఆశించినంత స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే జంటగా నటించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేసి భారీ నష్టాలను మూటకట్టుకుంది. ముఖ్యంగా డైరెక్టర్ పూరీ జగన్నాథ్, విజయ్ కెరీర్లోనే అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన
ఈ సినిమాలో రమ్యకృష్ణ, మైక్ టైసన్ కీలకపాత్రలలో నటించారు. అయితే ఈ సినిమా వచ్చి నెలలు గడుస్తున్నా లైగర్ గండం ఇంకా డైరెక్టర్ పూరినీ వదలట్లేదు. పూరి జగన్నాథ్ కొత్త సినిమా డీటెయిల్స్ సోమవారం రామ్ పోతినేని బర్త్ డే సందర్భంగా అనౌన్స్ చేయనున్నారు. దీంతో లైగర్ సినిమా బాధితులకు న్యాయం చేయండి అంటూ నష్టపరిహారం కోసం ఎగ్జిబిటర్స్ & లీజర్స్ అసోసియేషన్ ఈ రోజు ఫిల్మ్ ఛాంబర్ వద్ద నిరాహార దీక్షను ప్రారంభించింది.