Mahesh Babu : సినీ ఇండస్ట్రీ అంటేనే ఎప్పుడు ఏదో ఒక న్యూస్ తో హల్చల్ చేస్తూ హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటుంది. దాంట్లో హీరో, హీరోయిన్స్ కి సంబంధించిన విషయాలైతే ఇంకా ట్రెండీగా నడుస్తూ ఉంటాయి. అయితే మహేష్ బాబు మాత్రం ఎప్పుడూ కూడా హాట్ టాపిక్ గా నిలవలేదు. కానీ ఈరోజు ఆయన కూడా ట్రేండింగ్ లోకి వచ్చేసాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న మహేష్ బాబు ఎప్పుడూ ఒకటే రూల్స్ మెయింటెన్ చేస్తూ, ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎలా ఉన్నాడో, ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు.
ఆకట్టుకునే మెంటనెన్స్, కండిషన్స్ పరంగా కూడా ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. అయితే మహేష్ కెరియర్ లో ఓసారి మాత్రమే రూల్స్ బ్రేక్ చేశారు. అది కూడా ఒక హీరోయిన్ విషయంలో అని ఇప్పుడు ఆ వార్త నెట్ ఇంట్లో వైరల్ అయింది. కాజల్ అగర్వాల్ మహేష్ బాబు హీరో హీరోయిన్స్ గా నటించిన బిజినెస్ మాన్ సినిమా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఘనవిజయాన్ని సొంతం చేసుకున్న విషయం మనకు తెలిసిందే..
మహేష్ బాబు ఎంతోమంది హీరోయిన్స్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. కానీ ఆయనకు అందరికన్నా కాజల్ అగర్వాల్ చీరలో బాగుంటుంది, నచ్చుతుందని అన్నారు. ఈ విషయాన్ని కూడా మహేష్ బాబు, కాజల్ అగర్వాల్ కి ఓపెన్ గానే చెప్పేశారు. అలాగే బిజినెస్ మాన్ సినిమా షూట్ టైంలో కాజల్ అగర్వాల్ తో మాట్లాడుతూ.. ముఖ్యంగా హీరోయిన్ శారీస్ లలోనే బాగుంటారు. కానీ మీకు సారీ ఇంకా బాగుంది అని కాంప్లిమెంట్ ఇచ్చారంట. అదే విషయాన్ని పూరీ జగన్నాథ్ తో కూడా పంచుకొని స్క్రీన్ పైన కాజల్ అగర్వాల్ ని మరింత అందంగా చూపించడానికి సారీస్ ని సజెస్ట్ చేశారంట మహేష్ బాబు. ఇప్పుడు ఈ వార్త నెట్ ఇంట్లో వైరల్ అయి పోయింది.