Mahesh Babu – Venu Swamy : వేణు స్వామి సినిమా హీరో ,హీరోయిన్ల జాతకాలు చెబుతూ ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మహేష్ బాబు, వేణు స్వామికి సంబంధించిన ఒక పిక్ నెట్ ఇంట్లో వైరల్ అయింది. వేణు స్వామి టాపిక్ వచ్చిందంటే జనాలు ఏ హీరో, హీరోయిన్ గురించి, ఏ విషయాలు బయటపడతాయో.. అని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తారు.
ఇక విషయానికొస్తే.. మహేష్ బాబు కూడా వేను స్వామితో జాతకం చెప్పించుకుని పూజలు చేయించారని ఇప్పుడు ఒక వార్త తెగ హల్చల్ చేస్తుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా గతంలో వేణుస్వామితో పూజలు చేయించడం వల్లనే ఆయన సినీ రంగ భవిష్యత్తు చాలా అమోఘంగా వెలిగిపోతుందంటూ ఒక వార్త ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.
కానీ మహేష్ బాబు, వేణు స్వామి తో తన రాజకీయ భవిష్యత్తు గురించి ఎటువంటి పూజలు జరిపించలేదని ,అది ఒక సినిమా ప్రమోషన్ కోసం చేయించిన పూజలో తీసిన పిక్ అని తేలిపోయింది. దీంతో మహేష్ బాబు అభిమానులు మా మహేష్ ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మడంటూ మళ్లీ ఆ వార్తను వైరల్ చేస్తున్నారు.