Naga Chaitanya : విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటించిన ఖుషి సినిమా గురించి మనకు తెలిసిందే. ఈ సినిమా సెప్టెంబర్ ఒకటో తారీఖున రిలీజ్ కావడానికి రెడీగా ఉంది. అయితే ఈ సందర్భంలో ఒక న్యూస్ చాలా హాట్ టాపిక్ గా నిలిచింది. నాగ చైతన్య ఖుషి సినిమా ట్రైలర్ చూసి థియేటర్ నుండి బయటకు వచ్చేసాడంటూ ఒక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
నాగచైతన్య, సమంత వైవాహిక జీవితం నుంచి దూరమైనప్పటికీ వీరిద్దరికి సంబంధించిన ఏదో ఒక విషయం ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఖుషి సినిమా సెప్టెంబర్ ఒకటో తేదీన విడుదలవుతున్న సందర్భంగా ఆ చిత్రం యూనిట్ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను విరివిగా చేపడుతుంది. అందులో భాగంగా థియేటర్లలో ఖుషి ట్రైలర్స్ ప్రదర్శిస్తుంది. అయితే హైదరాబాదులో ఓ థియేటర్ లోకి వెళ్లిన చైతు మధ్యలో సామ్ ఖుషి సినిమా ట్రైలర్ చూసి అసహనానికి లోనై బయటకు వచ్చేసినట్టుగా ఒక వార్త తెగ వైరల్ అయిపోయింది.
ఒక కన్నడ సినిమా అయినటువంటి “బాయ్స్ హాస్టల్” సినిమాను చూసేందుకు థియేటర్ కు వెళ్లిన చైతు.. అక్కడ సినిమా మధ్యలో ఖుషి ట్రైలర్ చూసి ఇబ్బంది పడి బయటికి వచ్చేసాడు. అనే వార్త పలు వెబ్సైట్లో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే ఈ వార్తలకు చెక్ పెడుతూ చైతు ఒక ఇంటర్వ్యూలో స్పందించాడు. తనపై వస్తున్న ఆ రూమర్ల లో ఎలాంటి నిజం లేదని తాను అలా ప్రవర్తించలేదని ఆ వార్తలన్నీ వట్టి రూమర్స్ అని కొట్టి పడేశాడు. కొన్ని వెబ్సైట్ కొంతమంది కావాలనే ఇటువంటి వార్తలను క్రియేట్ చేసి పబ్లిష్ చేస్తున్నారని, వాటిని నమ్మవద్దని తన అభిప్రాయాన్ని చెప్పాడు. ఈ విషయం పైన తను చాలా క్లారిటీగా ఉన్నాడని వివరించారు.