Naga Chaitanya : హీరో నాగచైతన్య సినీ ఇండస్ట్రీలో హిట్ కొట్టి చాలా రోజులవుతుంది. లవ్ స్టోరీ సినిమా తర్వాత చైతు ఒక హిట్టును కూడా తన ఖాతాలో వేసుకోలేకపోయారు.ఇది నిరాశపరిచే విషయమే. అయితే చైతు తర్వాత సినిమా చందు మొండేటి దర్శకత్వంలో రాబోతుంది. ప్రేమమ్, సవ్యసాచి వంటి సినిమాలు వీరిద్దరి కాంబోలో ఇంతకు ముందు వచ్చాయి. ఇప్పుడు హ్యాట్రిక్ మూవీగా ఈ మూడో మూవీ చేయబోతున్నారు.
అయితే ఇది ఇలా ఉండగా గీత ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించబోతున్న ఒక సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుందని సమాచారం. ఇది గుజరాత్ లో జరిగిన నిజజీవిత ఘటన ఆధారంగా తీసే సినిమా అని తెలుస్తుంది. అయితే దీంట్లో నాగచైతన్య ఒక మత్స్యకారుడిలాగా మాస్ లుక్ లో కనిపించబోతున్నారని వినికిడి. ఆ పాత్ర కోసం చైతు చాలా గ్రౌండ్ వరకు చేస్తూ కష్టపడుతున్నాడు అని తెలుస్తుంది. ఇటీవలే దర్శకనిర్మాతలతో కలిసి చైతు ఎచ్చెర్ల మండలం కె మత్స్యలేశం గ్రామానికి కూడా వెళ్లాడని సమాచారం.
స్థానిక మత్స్యకారులతో మాట్లాడి వారి జీవన విధానం, స్థితిగతుల గురించి తెలుసుకొని అవగాహన పరుచుకున్నాడు. వాటి గురించి అప్పటి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో బాగా హల్ చల్ చేశాయి. అయితే ఇది ఇలా ఉండగా నాగచైతన్యకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అయి కూర్చుంది. ఒక స్టార్ హీరో నటిస్తున్న చిత్రానికి గాను ముఖ్యమైన పాత్రకు నాగచైతన్యను నటించడానికి పది రోజులు డేట్స్ కావాలని ఆ చిత్ర యూనిట్ సంప్రదించింది.
పది రోజులకుగాను 10 కోట్లు పారితోషకం ఇస్తామని, అనగా ఒక రోజుకి ఒక్కో కోటి చొప్పున ఇవ్వనున్నట్లు నాగచైతన్యను కోరగా.. నాగచైతన్య మాత్రం ఈ ఆఫర్ ని స్మూత్ గా రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. దానికి కారణం తాను త్వరలో చేయబోతున్న మత్స్యకారులకు సంబంధించిన సినిమానే. దానికోసం బాడీని ఫిట్ గా మెయింటైన్ చేస్తూ ఆ పాత్రకు తగ్గట్టుగా రెడీ అయిన నాగచైతన్య 10 రోజులకు కమిట్మెంట్ ఇస్తే ఆ చిత్రానికి, ఆ పాత్రకు న్యాయం చేయలేనని, బాడిని మళ్లీ ఫిట్గా తయారు చేసుకోలేనని ఈ భారీ ఆఫర్ వదులుకున్నట్లు తెలుస్తుంది. నాగచైతన్య కమిట్మెంట్ చూసి ఆయన ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు.