Naga Chaitanya – Sobhita : నాగచైతన్య సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 14 సంవత్సరాలు పూర్తి కావస్తున్నాయి. జోష్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అక్కినేని అందగాడు ఆ సినిమా హిట్ కాకపోయినా.. ఒకటి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ సినిమాల కంటే కూడా ఎక్కువగా సోషల్ మీడియాలో నాగచైతన్య న్యూస్ హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటాయి. సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య ఎప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఒక న్యూస్ లో కాంట్రవర్సీగా కనిపిస్తూనే ఉంటాడు. ఇప్పుడు రీసెంట్ గా మరో న్యూస్ తో హల్చల్ చేస్తున్నాడు.
నాగచైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాల విషయం రూమర్స్ ఎప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంటాయి. వీరిద్దరూ కలిసి టూర్లకు వెళ్లినట్టు, రెస్టారెంట్ లో ఉన్నట్టు కొన్ని న్యూస్ ఆప్పుడు బాగా హార్ట్ టాపిక్ గా మారాయి. ఇప్పుడు తాజాగా మరో న్యూస్ కూడా తెగ వైరల్ అయిపోయింది. శోభిత ధూళిపాల వస్తున్న రూమర్స్ గురించి మాట్లాడినప్పటికీ, నాగచైతన్య ఎప్పుడు కూడా వాటి గురించి నోరెత్తలేదు.
ప్రస్తుతం ఒక బుక్కు విషయంలో ఇద్దరు ఒకేలాగా స్పందించడంతో ఆ వార్త ఇప్పుడు చెక్కర్లు కొడుతుంది. కొద్ది క్రితం చైతన్య గ్రీన్ లైట్ అనే బుక్ గురించి చెబుతూ ” జీవితానికి ఒక ప్రేమ లేఖ. మీ ప్రయాణాన్ని మాతో పంచుకుందుకు మాధ్యు మాక్కనౌకే కు థాంక్యూ .. ఈ పఠనం నాకు గ్రీన్ లైట్ నింపింది. రెస్పెక్ట్ సర్ ” అంటూ పోస్ట్ చేశాడు. రీసెంట్ అదే బుక్ ను శోభిత షేర్ చేస్తూ “గత కొన్ని నెలల్లో నేను చదివిన అత్యుత్తమ పుస్తకం. ఎంతో అపురూపమైన కథ. ఒక పాట లాగా, నిజంగా విపరీతమైన నవ్వు మరియు స్వాతంత్య్రాన్ని సంపాదించిన రుచిగా ఉంది” అంటూ పోస్ట్ చేసింది. ఇక ఇద్దరి ట్వీట్స్ పై నాగచైతన్య, శోభిత కి ఆ బుక్ తో గిఫ్ట్ గా ఇచ్చాడా.. తను కూడా అదే బుక్ గురించి మాట్లాడుతుంది వీరిద్దరి మధ్య రిలేషన్ ఉంది అంటూ..కమెంట్స్ పెడుతున్నారు.