Nagarjuna 99 Movie : నాగార్జున పుట్టినరోజు నేడు 64 సంవత్సరాలు వచ్చిన ఇంకా ఎంతో అందంగా కనిపిస్తూ ఇప్పటికి మన్మధుడుగా, టాలీవుడ్ కింగ్ గానే ఆయన ఉన్నాడు. ఇంత వయసులో కూడా అంత అందాన్ని మెయింటైన్ చేయడం అంటే అదొక నాగార్జునకే చెల్లింది అనుకోవచ్చు. అందంతోపాటు, ఆరోగ్యంగా బాడిని మెయింటైన్ చేస్తూ కుర్రకారికి ఏ మాత్రం తీసిపోకోకుండా ముందుకు సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు నాగార్జున.
ఇప్పటి వరకు 98 సినిమాలలో నటించిన నాగార్జున. 100 సినిమాలకు మరో రెండు అడుగుల దూరంలోనే ఉన్నాడు. ఇంతకుముందే తీసినటువంటి ఘోస్ట్ సినిమా ప్రేక్షకులను అంతగా అలరించకపోయినప్పటికీ నాగార్జున అభిమానులు మాత్రం ఆయన సినిమా ఎప్పుడు వస్తుందా అని చాలా ఆత్రుతగా ఎదురు చూస్తూనే ఉంటారు. ప్రేక్షకుల్లో అంతా అభిమానాన్ని సంపాదించారు. నాగార్జున తాను తీస్తున్నటువంటి సినిమాలు కుటుంబ సమేతంగా కూర్చొని చూసే విధంగా ఉంటాయి.
నాగార్జున పుట్టినరోజు సందర్భంగా తన 99 వ సినిమాను ప్రకటించారు. ఈ సినిమా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మించనున్నారు. నాగార్జున తన కెరీర్ మొత్తంలో ఎంతో మంది కొత్త దర్శకులతో పనిచేశారు. అవకాశాలు కూడా ఇచ్చారు. ఈ సినిమాకు గాను కొత్తగా డైరెక్టర్ నీ పరిచయం చేస్తున్నారు. ఈ సినిమాకు విజయ్ బిన్నీ అనే ఒక కొత్త దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించనున్నారు.
అయితే నాగార్జున పుట్టినరోజు సందర్భంగ ” నా సామి రంగా” అనే వినూత్న టైటిల్ ని సినిమాకు ఖరారు చేసి ప్రకటించారు. అలాగే టైటిల్ తో పాటుగా చిన్న గ్లింప్స్ విడుదల చేశారు. ఈ సినిమాలో నాగార్జున ఒక మాస్ రోలో కనిపించనున్నారని వినికిడి. ఆ గ్లింప్స్ లో నాగార్జున లుంగీ కట్టి, బీడీ కాలుస్తూ మాస్ రోల్ లో కనిపించారు. ఘోస్ట్ సినిమా తర్వాత ఎటువంటి అప్డేట్ లేకుండా సైలెంట్ గా ఉన్న నాగార్జున ఇప్పుడు తన పుట్టినరోజు సందర్భంగా ఏకంగా కొత్త సినిమాను ప్రకటించేసి సంక్రాంతి బరిలో నిలిచారు. ఈ సందర్భంగా అందరి తరపున నాగార్జునకు ప్రత్యేకమైన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ తీయబోతున్న సినిమా విజయవంతం కావాలని కోరుకుందాం..