Namrata Shirodkar : నమ్రత శిరోధ్కర్ తనకంటూ ఒక ట్రెండ్ సృష్టించుకుని ఒకప్పుడు హీరోయిన్ గా చేస్తూ.. సూపర్ స్టార్ మహేష్ బాబు ని పెళ్లి చేసుకుని తనకు సంబంధించినటువంటి అన్ని పనులను చూసుకుంటూ.. ఫ్యామిలీని చాలా చక్కగా రన్ చేస్తూ.. మహేష్ బాబుకి చాలా సపోర్ట్ గా ఉంటూ..ఇలా నమ్రత తన మల్టీ టాలెంట్ ను ప్రదర్శిస్తూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మహేష్ కు సంబంధించిన అన్ని విషయాలను ఆమె చూసుకుంటుంది. సినిమాలకు సంబంధించిన డేట్స్, నిర్మాణం, యాడ్స్, బిజినెస్ లు ,పారితోషకాలు ఒకటేమిటి టోటల్ పూర్తి బాధ్యత నమ్రత మీదనే ఉంటుంది. అన్నీ బాధ్యతలను చక్కగా రాణిస్తుంది.
ఒకవైపు మహేష్ బాబుకు సంబంధించిన అన్ని విషయాలు చాలా స్మూత్ గా డీల్ చేస్తూ.. మరోవైపు పిల్లలు గౌతమ్, సితారలకు సంబంధించిన విషయాలు కూడా తనే చూసుకుంటూ మల్టీ టాలెంటెను నమ్రత ప్రదర్శిస్తుంది. ఇంత బిజీగా ఉండే నమ్రత అప్పుడప్పుడు గ్లామర్ గా తయారై హాట్ పోజులతో మైండ్ బ్లాక్ చేస్తుంది. స్టార్‌వైఫ్ గ్లామర్ ట్రీట్ ఎలా ఉంటుందో చూపిస్తు, ఫోటో షూట్లు చేస్తుంది. ఆ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ మహేష్ ఫ్యాన్స్ కి షాకిస్తుంది.
ఈ మధ్య నమ్రత నగల కోసం ఒక ఫోటో షూట్ చేసింది. మెడలో హారాలు ధరించి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఇప్పుడు ఈ పిక్స్ ఇంస్టాగ్రామ్ లో వైరల్ అయిపోయాయి. చాలా మంది నెటిజన్స్ స్పందిస్తూ నమ్రత రోజుకి రోజుకి యంగ్ గా మారిపోతుంది. అని కామెంట్ చేస్తున్నారు. నమ్రత బాలీవుడ్ సినిమాలో హీరోయిన్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అక్కడ స్టార్ ఇమేజె సొంతం చేసుకుంది. ఆ క్రమంలోనే మహేష్, నమ్రత కలిసి నటించిన వంశీ సినిమా రిలీజ్ అయింది. అప్పటి నుంచే వీరు ప్రేమాయణం మొదలైంది.
తర్వాత అది కాస్త పెళ్లి వరకు వెళ్ళింది. నమ్రత పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైనప్పటికీ తన ఉనికిని ప్రదర్శిస్తూనే ఉంది. 2005లో మహేష్ బాబు నమ్రతను పెళ్లి చేసుకున్న తర్వాత మహేష్ బాబుకు చాలా కలిసి వచ్చిందని చెప్తారు. నమ్రత రాయల్ ఫ్యామిలీ నుంచి రావడమే దీనికి కారణం. ఆమె వాటా కింద రెండు వేల కోట్లు వచ్చాయంటే ఆమె ఫ్యామిలీ ఎంత రిచ్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు.