Nandamuri Balakrishna : తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ హీరోలు అంటే టక్కున మనకు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వీరి పేర్లే గుర్తొస్తూ ఉంటాయి. ఇప్పటివరకు వీరినే సినిమాల్లో హీరోలుగా పెట్టి తీస్తున్నారు. అందులో ఇప్పటికే నాగార్జున, వెంకటేష్ కథను బట్టి క్యారెక్టర్ చేసుకుంటూ హీరోల కంటే కూడా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేయడానికి ఇష్టపడుతున్నారు. అయితే మెగాస్టార్ హీరోగా చేస్తున్నప్పటికీ ఈ మధ్య ఆ సినిమాలు అంతగా క్లిక్ అవ్వట్లేదు.
ఇక ఇప్పటికీ హీరోగా సీనియర్ హీరో లైన్లో ఉన్నారు అంటే అది ఒక నందమూరి బాలకృష్ణ. కానీ ఇప్పుడు రాబోయే రోజులలో నందమూరి కూడా అచ్చం ఆ ముగ్గురు హీరోల లెక్కలోకి వెళ్తాడు. అని ఒక న్యూస్ ట్రెండ్ చేస్తున్నారు ఆడియన్స్. విషయం ఏమిటంటే.. విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగార్జున తమ వయసుకు తగ్గట్టు ఇప్పటికే కథలు ఎంచుకుంటూ.. హీరో గానే చేయాలని నానుడికి బ్రేక్ పెట్టేశారు. సీనియర్ పాత్రలు చేస్తూ తమ ఇమేజ్ ని కాపాడుకుంటూ వస్తున్నారు. నాగార్జున అప్పుడు ఇప్పుడు హీరోగా చేస్తున్నప్పటికీ ఆ సినిమాలు హిట్ అవ్వడం లేదు.
మెగాస్టార్ ది కూడా అదే కోవాలోకి చెందుతుంది. ఇక బాలకృష్ణ ఇప్పటికీ ఫామ్ లో ఉన్నాడంటే అది మామూలు విషయం కాదు. ఏకంగా 100 కోట్లను క్రాస్ చేస్తూ తన సత్తా చాటేస్తున్నాడు. అయితే రానున్న రోజుల్లో బాలకృష్ణ కూడా ట్రాక్ మార్చాల్సిన పరిస్థితి వస్తుంది. అని జనాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వయస్సు మీద పడే కొద్దీ మొహంలో ఎంత మేకప్ చేసిన, ఎంత కష్టపడినా కూడా వయసును కవర్ చేయడం జరగదు. బాలయ్య భగవంత్ కేసరి సినిమాతో రానున్నాడు. దాని తర్వాత బాబి డైరెక్షన్లో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. ఆ సినిమా తర్వాత బాలయ్య హీరోగా సినిమాలు చేయడం కష్టమే అంటున్నారు నెటిజెన్స్.. చూడాలి మరి ఈ విషయం ఎంతవరకు కరెక్ట్ అవుతుందో..