Nayanthara : సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ అయిన నయనతార ఇప్పుడు మంచి ఫామ్ లో ఉంది. అలాగే హ్యాపీగా కూడా ఉంది. తాను మొదటిసారి బాలీవుడ్ లో నటించిన జవాన్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి త్వరలోనే 1000 కోట్ల క్లబ్ లోకి చేరుతున్న సందర్భంగా ఆమె ఆనందానికి అవధులు లేవు. దక్షిణాదిన అధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్లలో నయన్ ఒక స్థానంలో ఉన్నారు. ఆమె ఒక్కో సినిమాకు గాను 8 నుంచి 10 కోట్ల పారితోషకాన్ని తీసుకుంటారు. అయితే జవాన్ సినిమాకు గాను ఆమె 11 కోట్ల పారితోషికాన్ని తీసుకున్నట్టు తెలుస్తుంది.
జవాన్ సినిమాలో నర్మదా అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నయనతార నటించి యాక్షన్ సన్నివేశాల్లోనూ గ్లామర్ తోను ప్రేక్షకులను ఆకట్టుకుంది. జవాన్ కు అట్లీ దర్శకత్వం వహించారు. షారుక్, నయన్‌తో పాటు దీపికా పదుకొణె, విజయ్ సేతుపతి, ప్రియమణి, సంజయ్ దత్, సాన్యా మల్హోత్రా, యోగిబాబు, సునీల్ గ్రోవర్, సంజీత్ భట్టాచార్య వంటి ప్రముఖులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.
జవాన్ హిట్ తో ఈమె ఈ హ్యాపీనెస్ లో ఒక పోస్ట్ ని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. తన భర్త విగ్నేష్ శివన్ ధరించిన టీషర్ట్ పైన…’మంచి రోజులు ఇప్పుడే మొదలయ్యాయి..అని రాసి ఉంది.. ఆ ఫోటోలను నయన్ ఇన్స్టాల్ లో పోస్ట్ చేసింది.ఇది ఇప్పుడు హాట్ టాపిక్ నడుస్తుంది. లాస్ట్ ఇయర్ విగ్నేష్ శివన్ నీ పెళ్లి చేసుకోవడం. ఆ తర్వాత ఇద్దరు పిల్లలకి వారు తల్లిదండ్రులు కావడం ,వెంటనే బాలీవుడ్ లో ఆమెకు ఆఫర్ రావడం, ఇప్పుడు అది కాస్త హై లెవెల్ లో సక్సెస్ అయి ఆమెను ఒక రేంజ్ లో నిలబెట్టడం చూస్తుంటే, ఇవన్నీ తనకు మంచి శకునాలుగా నయన్ భావిస్తున్నట్టు తెలుస్తుంది.
నయన్ ఈ సక్సెస్ తర్వాత తన పారితోషికాన్ని భారీగా పెంచిందని తెలుస్తోంది. అలాగే భారీ బడ్జెట్ ల నిర్మాతలు కూడా నయనతార కాల్షీట్స్ కోసం ప్రయత్నిస్తున్నారాని వినికిడి. జయం రవితో, నయన్ ఇరైవన్ అనే ఒక సినిమా షూటింగ్ లో ఉన్నారు. ఆ తర్వాత లేడీ సూపర్ స్టార్ 75 (వర్కింగ్ టైటిల్) ,టెస్ట్ అనే సినిమాలలో కూడా నయన్ నటిస్తున్నారు.